కుప్ప కూలిన క‌న్న‌డ స‌ర్కార్ - అనుకూలం 99 - ప్ర‌తికూలం 105 - వీగిన విశ్వాసం..యెడ్డీనే సీఎం..!

మోడీ, షాల ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయింది. ఎట్ట‌కేల‌కు గ‌త కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతూ క‌న్న‌డ రాజ‌కీయాన్ని మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార్చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప కూలి పోయింది. అవిశ్వాస తీర్మానం మేర‌కు క‌ర్నాట‌క విధాన‌స‌భ‌లో స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ స‌మ‌క్షంలో సీఎం కుమార స్వామి ప్ర‌వేశ పెట్టారు. అంత‌కు ముందు కుమార స్వామి ఉద్వేగ‌భ‌రిత ప్ర‌సంగం చేశారు. తాను ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాన‌ని, ఎన్నో అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ సంకీర్ణ స‌ర్కార్‌ను కూల్చేప‌నిగా పెట్టుకుంద‌ని, అందులో భాగంగానే ఇవాళ జ‌రుగుతున్న నాట‌కీయ ప‌రిణామాలని స్ప‌ష్టం చేశారు. విశ్వాస తీర్మానం వీగి పోవ‌డంతో కుమార ఇక మాజీ ముఖ్య‌మంత్రి కానున్నారు.

సీఎం మాట్లాడాక‌..ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరున్న డీకే శివ‌కుమార్ ఆవేశంగా మాట్లాడారు. త‌మ సంకీర్ణ ప్ర‌భుత్వం న్యాయ‌బ‌ద్ధంగానే వ్య‌వ‌హ‌రించింద‌న్నారు. తాను కూడా ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశామ‌న్నారు. క‌న్న‌డ విధాన‌స‌భ‌లో జ‌రుగుతున్న అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా జ‌రిగిన దానిని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశారు. స‌భాప‌తిగా ఉన్న ర‌మేష్ కుమార్ అటు అధికారం నుంచి ఇటు ప్ర‌తిప‌క్షం నుంచి తీవ్ర వ‌త్తిళ్ల‌ను ఎదుర్కొన్నారు. క‌ర్నాట‌క‌లో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించారు. విధాన స‌భ ప‌రిస‌రాల‌లో 144 సెక్ష‌న్ విధించారు. బ‌ల‌ప‌రీక్ష‌లో కుమార‌స్వామి త‌న బ‌లాన్ని నిరూపించుకోలేక పోయారు. ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం లేక పోయింది. ఈ ప‌రీక్ష‌లో సంకీర్ణ ప్ర‌భుత్వానికి 116 స‌భ్యులు ఉండ‌గా , 14 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేలు హాజ‌రు కాలేదు. మొత్తం ఓటింగ్ ప్ర‌క్రియ రాజ్యాంగ బ‌ద్దంగా నిర్వ‌హించారు స్పీక‌ర్ ర‌మేష్ కుమార్. కాంగ్రెస్, జేడీఎస్ కు స్పేస్ లేకుండా పోయింది. 14 నెల‌ల పాటు మాత్ర‌మే ఉన్న‌ది సంకీర్ణ స‌ర్కార్.

ప్ర‌భుత్వానికి మ్యాజిక్ ఫిగ‌ర్ 103 స‌భ్యులు కావాల్సి ఉండ‌గా సంకీర్ణ స‌ర్కార్ 99 ఓట్లు పోల్ కాగా, ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న బీజేపీ 105 ఓట్లు పోల్ అయ్యాయి. ఎవ‌రెవ‌రు ఏయే వైపు ఉన్నారోన‌ని హైకోర్ట‌కు చెందిన ప్ర‌భుత్వ లాయ‌ర్లు లెక్కించారు. స్పీక‌ర్‌కు అంద‌జేశారు. మొత్తం సంఖ్య‌ను ప‌రిశీలించిన ర‌మేష్ కుమార్ పోలైన ఓట్ల‌ను ప్ర‌క‌టించారు.
రోజు రోజుకు టెన్ష‌న్ క్రియేట్ చేస్తూ మ‌రింత హీట్ పెంచిన క‌న్న‌డ రాజ‌కీయం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యేలా చేసింది. 105 ఓట్లు పోల్ కావ‌డంతో ..ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి కుమార స్వామి ..రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు బ‌య‌లు దేరారు. త‌న రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఎక్కువ స‌భ్యులు క‌లిగిన యెడ్యూర‌ప్ప‌ను ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పిలువ‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానేజ్ చేయ‌లేక పోయింది. కుమార‌స్వామి త‌న వారిని నియంత్రించు కోగ‌లిగారు. యెడ్డీ త‌న ప్లాన్‌ను ఇంప్లిమెంటేష‌న్ చేశారు. త‌న క‌ల‌ను మ‌రోసారి నెవ‌ర‌వేర్చుకునే ప‌నిలో ప‌డ్డారు యెడ్డీ. మొత్తం మీద సుప్రీంకోర్టుకు చేరిన గొడ‌వ ఇక స‌ద్దుమ‌ణుగ‌నుంది. మొత్తం మీద క‌న్న‌డ నాట త‌లెత్తిన సందిగ్ధంలో స్పీక‌ర్ సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ గా నిలిచారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!