అబ్బా కోలుకోలేని దెబ్బ..దిగ్గజ సంస్థ దివాళా..!

సుదీర్ఘమైన చరిత్ర కలిగిన బ్రిటన్ కు చెందిన థామస్ కుక్ సంస్థ దివాళా తీసినట్తు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వరల్డ్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మందగమనం నెలకొన్నది. నిన్నటి దాకా ఇండియా పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రభుత్వ బ్యాంకులు సైతం ఇప్పుడు ఆసరా కోసం ఎదురు చూస్తున్నాయి. దాదాపు 178 ఏళ్ళ ఘనమైన చరిత్ర కలిగి ఉన్నది థామస్ కుక్ కంపెనీకి. బెయిల్ అవుట్ ఇవ్వడానికి  ఇంగ్లాండ్ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపక పోవడం గమనార్హం. ఈ ఒక్క డెసిషన్ తో 22 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. వారికి ఏవిధంగా ఉపాధి కల్పిస్తుందో వేచి చూడాలి. 1841 లో థామస్ కుక్ ప్రారంభమైంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ప్రతి ఏటా దాదాపు 1000 కోట్ల పౌండ్లు ఆదాయం వచ్చేది. కానీ ఎప్పుడైతే మెట్రావల్ కంపెనీని  కొనుగోలు చేసిందో ఇక అప్పటి నుంచి థామస్ కుక్ కోలుకోలేని స్థితికి దిగజారింది.

పర్యాటక రంగంలో ఈ కంపెనీ తర్వాతనే ఏదైనా. సర్వీస్ ఇవ్వడంలోనూ, సౌకర్యాలను కల్పించడం లోను ఈ సంస్థ కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నది. కాగా ఆన్‌లైన్‌ పోటీ, బ్రెగ్జిట్‌ అనిశ్చితితో నెమ్మదించిన బ్రిటన్‌ పర్యాటక రంగం కలసి థామస్‌ కుక్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. భారీగా ఆఫర్లు ప్రకటించినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎటూ పాలు పోనీ స్థితిలో దివాళా తీసినట్టు కంపెనీ ప్రకటించింది. చైనాకు చెందిన ఫోసన్‌ సంస్థ థామస్‌ కుక్‌లో అత్యధిక వాటా దారుగా ఉంది. ఇప్పటికే గత నెలలో 3,900 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. మరో 45 కోట్ల పౌండ్లు పెట్టుబడులు పెడతామని, అందుకు ప్రతిగా.. సంస్థలో 75 శాతం వాటాను, విమానయానంలో 25 శాతం వాటా ఇవ్వాలని ప్రతిపాదనలు ముందుంచింది. దీనిపై రెండు సంస్థల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సంస్థ ఇప్పటికిప్పుడు బతికి బట్టకట్టాలంటే కనీసం 1,763 కోట్ల నిధులు అవసరం అవుతాయి. ఈ మొత్తాన్ని సమీకరించడంలో సంస్థ విఫలమైంది.

బ్రిటన్‌ ప్రభుత్వమైనా ఆదుకుంటుందేమోనని ఆశించిన థామస్‌ కుక్‌కు అక్కడా భంగపాటే ఎదురైంది. దీంతో సంస్థ దివాలా ప్రకటించడం తప్ప మరో దారిలేదని బోర్డు తీర్మానించింది అని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రయాణ సంస్థ, తొలుత బ్రిటన్‌లోని ప్రయాణికులను చేరవేసింది. తర్వాతి కాలంలో ప్రపంచ దేశాలకు పర్యాటకులను తీసుకెళ్లే ట్రావెల్‌ సంస్థగా స్థిరపడింది. అయితే.. 2007లో మైట్రావెల్‌ సంస్థను విలీనం చేసుకున్నప్పటి నుంచీ కుక్‌ అప్పుల్లో కూరుకు పోయింది. ఈ ట్రావెల్ కంపెనీ ద్వారా విదేశాల్లో పర్యటనలకు వెళ్లిన సుమారు 6 లక్షల మంది పలు దేశాల్లో చిక్కుకు పోయారు. వీరిలో లక్షన్నరకు పైగా బ్రిటన్‌ వాసులున్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. దివాళా ప్రకటన దెబ్బకు ట్రావెల్ షేర్స్ ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. మొత్తం మీద ఇప్పటికిప్పుడు చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగం అంత బాగోలేదని అర్థమవుతోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!