మోదీ వన్ మెన్ షో .. ప్రెసిడెంట్ ఔరా..పీఎం భళా
ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అగ్ర రాజ్యం అమెరికా విస్తు పోయేలా భారత ప్రధానమంత్రి మోదీ మ్యాజిక్ చేసేశారు. ఆయన మాట్లాడిన తీరుకు ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ సైతం తన గురించి ఆలోచించేలా చేశారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉన్నది. వేరే భూభాగంలోకి చొరబడి వారిపై దాడులు చేయడం, మట్టు బెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. హ్యూస్టన్ లో జరిగిన ఒకే ఒక్క సమావేశం పూర్తిగా భారతీయ జెండాలతో, మోదీ అంటూ అనుకూల నినాదాలతో పూర్తి గా నిండి పోయింది. ప్రవాస భారతీయుల మద్దతును చూసి ట్రంప్ అలా చూస్తూనే వుండి పోయారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఇండియా తరపున ఎంత సపోర్ట్ కావాలో తెలిసేలా చెప్పడంలో ఇండియన్ పీఎం చెప్పకనే చెప్పారు. మోదీ సాధించిన దౌత్య విజయం ఇది. పక్కనే ఉన్న దాయాది దేశం ఆడుతున్న నాటకాలను బట్టబయలు చేశారు.
అంతే కాకుండా ఏ సమయంలోనైనా తాము దాడులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దీంతో ఓ వైపు ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం నెరపాలని ఉవ్విళ్ళూరుతున్న అమెరికా ప్రెసిడెంట్ కు అలాంటి ఛాన్స్ ఇవ్వకుండానే ఘాటుగా చెప్పారు. తమ దేశం శాంతిని కోరుకుంటుంది. మా ప్రాంతానికి సంబంధించి ఏ ఒక్క అంగుళం భూమిని వదులుకునే ప్రసక్తే లేదు. ఎవ్వరైనా కాదని కాలు దువ్వినా లేదా అంతర్గతంగా అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నం చేసినా ఆ దేశం ప్రపంచ పాఠం నుంచి పూర్తిగా లేకుండా పోతుందని హెచ్చరించారు. అంతే కాకుండా పాకిస్తాన్ చేస్తున్న చర్యలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సమయంలో మళ్ళీ అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ రావాలని కోరారు. ఒక్కసారిగా ట్రంప్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇలా తన వాగ్దాటితో ప్రవాస భారతీయులతో పాటు అమెరికన్ల మనసుల్ని దోచుకున్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీజి.
ఒక్క దెబ్బతో అనేక లక్ష్యాలను సాధించడం మోదీ నైజమని, ఇక్కడ కూడా అదే అనుసరించారని రాజకీయ మేధావులు అభిప్రాయం పడుతున్నారు. ఆర్టికల్ 370 నిర్వీర్యం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి హ్యూస్టన్ సభ ద్వారా భారత సంతతి ప్రజలందరి మద్దతునూ మోదీ సాధించారు. అమెరికా ఆమోదాన్ని కూడా దాదాపుగా పొందారు. ప్రధాని ప్రత్యేకంగా 9-11ను, ముంబై మారణ హోమం జరిగిన 26-11ను కూడా ప్రస్తావించారు. రెండింటికీ కారణం పాకిస్థానేనని ఆయన పేరెత్తకుండా అమెరికన్లకు చెప్పారు...తద్వారా దాయాది దేశాన్ని ఏకాకిని చేసేశారు. డొనాల్డ్ ట్రంప్-ఇమ్రాన్ ఖాన్‌ల భేటీ జరగడానికి 24 గంటల ముందుగానే మోదీ పాక్‌ను ఓ భూతంలా భూతద్దంలో చూపెట్టారు. అంతేకాదు.. పీవోకేపై ఏదైనా కీలక నిర్ణయం తీసుకున్నా దానికి అమెరికా వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా మోదీ ముందుగానే పావులు కదిపారు. మొత్తం మీద మోదీ అనుకున్నట్టుగానే పక్క ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేశారు. అది పూర్తిగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి