ముంబ‌యిని ముంచెత్తిన వాన‌లు..త‌ల్ల‌డిల్లుతున్న జ‌నాలు..!

దక్షిణాదిన వ‌ర్షాలు లేక త‌ల్ల‌డిల్లి పోతుంటే..సాగు నీరు దేవుడెరుగు క‌నీసం తాగేందుకు నీళ్లు దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంటే.. మ‌రో వైపు ముంబ‌యిలో మాత్రం ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో జ‌న జీవ‌నం స్తంభించి పోయింది. దేశ ఆర్థిక రంగానికి ఆయువు ప‌ట్టుగా ఉన్న ఈ న‌గ‌రం ఇపుడు జ‌నం హాహాకార‌ల‌తో ద‌ద్ద‌రిల్లి పోతోంది.  రాక‌పోక‌లు స్తంభించి పోయాయి. ఇళ్ల‌ల్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితులు లేవు. ఎక్క‌డ చూసినా వ‌ర‌ద‌లే..నీళ్లే..న‌గ‌ర వాసుల‌కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. విమానాశ్ర‌యం నీళ్ల‌తో నిండి పోయింది. రైళ్లు , బ‌స్సులు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచి పోయాయి. ర‌వాణా వ్య‌వ‌స్థ అర్దాంత‌రంగా ఆగి పోయింది. వ‌ర‌ద ప్ర‌వాహాం దెబ్బ‌కు ఏకంగా మ‌హాల‌క్ష్మి ఎక్స్ ప్రెస్ రైలు నిలిచి పోయింది. అందులో ప్ర‌యాణిస్తున్న వారిని నావికా, ర‌క్షక ద‌ళాలు ర‌క్షించాయి. ల‌క్ష‌లాది మందికి ప‌ర‌క్షోంగా ఉపాధి క‌ల్పించిన ఈ న‌గ‌రం ఇపుడు బేల చూపులు చూస్తోంది. 

ఈ రైలులో 17 గంట‌ల‌కు పైగా బిక్కు బిక్కు మంటూ గ‌డిపారు. 1050 మందికి పైగా ప్ర‌యాణికుల‌ను ర‌క్షించారు. త‌మ విద్యుక్త ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించారు. రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగ‌డంతో అతి పెద్ద ఉప‌ద్రవం నుంచి బ‌య‌ట ప‌డ్డారు బాధితులు. ఈ ఎక్స్ ప్రెస్ రైలు ముంబ‌యి నుండి కొల్హాపూర్‌కు బ‌య‌లు దేరింది. అర్ధ‌రాత్రి దాటాక ప‌ట్టాల మీదే ఆగి పోయింది. హాయిగా నిద్ర పోయిన ట్రావెల‌ర్స్ లేచి చూస్తే..రైలు ఆగే ఉంది..కానీ ఎటు చూసినా నీళ్లే..వ‌ర‌ద ప్ర‌వాహ‌మే. దెబ్బ‌కు డీలా ప‌డి పోయారు. చాలా మంది ఏడ్వ‌డం ప్రారంభించారు. ఎటూ పాలుపోక రక్షించ‌మంటూ కేక‌లు వేశారు. వ‌ర‌ద‌లో చిక్కుకు పోయిన రైలు గురించిన స‌మాచారం ప్ర‌భుత్వానికి అందింది. దీంతో స‌ర్కార్ రెస్క్యూ టీంల‌ను పంపించింది. అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేశాయి. అందులో ప్ర‌యాణిస్తున్న వారిని ఫ్లైట్లు, ఇత‌ర మార్గాల ద్వారా బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చారు. ప్రాణాలు పోకుండా కాపాడారు. ఒక‌టా రెండా ఏకంగా కొన్ని గంట‌ల పాటు న‌ర‌కాన్ని చ‌వి చూశారు ప్ర‌యాణికులు. 

ప్ర‌కృతి విల‌య తాండ‌వం చేస్తే..ఎలా వుంటుందో ముంబ‌యి వాసుల‌కు ఇపుడు తెలుసొస్తోంది. ఇంకో వైపు అసోం, త‌దిత‌ర రాష్ట్రాల‌లో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర‌ద‌ల తాకిడికి ఇప్ప‌టికే 5 ల‌క్ష‌ల మందికి పైగా నిరాశ్ర‌యులుగా మారారు. కేంద్ర స‌ర్కార్ స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆదేశించింది. భారీ ఎత్తున ఆహారం, త‌దిత‌ర సామాగ్రిని పంపించింది. ఇత‌ర రాష్ట్రాలు కూడా త‌మ వంతుగా సాయాన్ని అంద‌జేస్తున్నాయి. మ‌రో వైపు నీటి ప్ర‌వాహానికి విల‌విల‌లాడి పోతున్న బొంబాయిని బ‌తికించుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌విస్. ఆయ‌న స‌ర్కార్ కొలువుతీరిన నాటి నుంచి ఇలాంటి ఉప‌ద్ర‌వాలే ముంచుకు వ‌స్తున్నాయి. ఓ వైపు కేంద్రం..మ‌రో వైపు రాష్ట్రం రెండూ క‌లిసి విప‌త్తుల నుంచి కాపాడేందుకు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నాయి.   వాతావ‌ర‌ణ శాఖ ఇంకా రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్ప‌డంతో ..ముంబ‌యి వ‌ణికి పోతోంది. న‌గ‌ర వాసులంతా వ‌ర్షం ఆగిపోవాల‌ని షిర్డీ సాయినాథుడిని, కొల్హాపూర్ అమ్మ వారిని వేడుకుంటున్నారు. 

కామెంట్‌లు