క‌ర్నాట‌క స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం .. 14 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌పై వేటు

క‌న్న‌డ నాట ప‌వ‌ర్ పాలిటిక్స్ కంటిన్యూ అవుతూనే వున్నాయి. నిన్న‌టి దాకా 15 రోజుల పాటు ఉత్కంఠ కొన‌సాగింది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ స‌ర్కార్ కూలి పోవ‌డం, బీజేపీ స‌ర్కార్ కొలువు తీర‌డం, ఆ పార్టీ తర‌పున యెడ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా హుటా హుటిన ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం జ‌రిగి పోయింది. ప్ర‌భుత్వానికి కావాల్సిన బ‌లాన్ని తిరిగి నిరూపించు కోవాల్సిన ప‌రిస్థితి బీజేపీపై ఉంది. ఇందు కోసం ఇప్ప‌టికే ముగ్గురు రెబ‌ల్ ఎమ్మ్యేల్య‌పై అన‌ర్హ‌త వేటు వేశారు స్పీక‌ర్ ర‌మేష్ కుమార్. దీంతో కేంద్రంలోని క‌మ‌ల స‌ర్కార్ సీరియ‌స్ గా తీసుకుంది. ఎలాగైనా స‌రే క‌ర్నాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని పూర్తి కాలం న‌డిపించాల‌నే కృత నిశ్చ‌యంతో ఉంది. దీంతో రాజ్యాంగ‌బ‌ద్దంగా ఎన్నికైన స్పీక‌ర్ ఇపుడు కీల‌కంగా మారడంతో వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. స్పీక‌ర్‌గా ఎన్నికైన ర‌మేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్య‌క్తి. ఎలాగైనా స‌రే సంకీర్ణ స‌ర్కార్‌ను గ‌ట్టెక్కించేందుకు ఆయ‌న ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు.

చివ‌రి వ‌ర‌కు దానిని నిల‌బెట్టాల‌ని చూశారు. తీరా క‌మ‌ల‌నాథులు రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను ప్ర‌భావితం చేయడం, తాయిలాలు ఎర చూప‌డంతో క‌థ మొద‌టికొచ్చింది. బ‌ల‌ప‌రీక్ష స‌మ‌యానికి రెబ‌ల్స్ వ‌స్తార‌ని ఆశించారు మాజీ సీఎం కుమార స్వామి, సిద్దిరామ‌ప్ప‌, డీకే శికుమార్‌లు. కానీ వారిని ఒప్పించ‌క పోవ‌డంతో క‌న్న‌డ నాట కొత్త అధ్యాయం మొద‌లైంది. ముచ్చ‌ట‌గా నాలుగోసారి యెడ్యూర‌ప్ప సీఎంగా కొలువు తీరారు. విశ్వాస తీర్మానం సంద‌ర్భంగా స్పీక‌ర్ చాలా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. మొత్తం త‌తంగాన్ని జ‌నం చూడాల‌ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసేలా ఆదేశాలు జారీ చేశారు ర‌మేష్ కుమార్. ప్ర‌భుత్వం ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో..ప్ర‌జ‌ల‌కు ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధులు తాము ఎలా న‌డుచు కోవాలో చెప్ప‌క‌నే చెప్పారు స్పీక‌ర్. త‌మ‌కు 105 మంది ఎమ్మ్యేల్య‌ల మ‌ద్ధ‌తు ఉంద‌ని స్ప‌ష్టం చేసిన తాజా ముఖ్య‌మంత్రి యెడ్యూర‌ప్ప రేపు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టాల్సి వుంది. అంత‌కు ముందు ఆయ‌న కూడా మ‌రోసారి బ‌ల‌ప‌రీక్ష‌కు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో స్పీక‌ర్ కేఆర్ ర‌మేష్ కుమార్ ..సంచ‌ల‌నానికి తెర లేపారు.

ఇప్ప‌టికే రెబ‌ల్ ఎమ్మ్యేల‌పై వేటు వేసిన ఆయ‌న ఏకంగా మ‌రో 14 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను డిస్ క్వాలిఫై చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు కాగా, మిగ‌తా ఎమ్మెల్యేలు జేడీఎస్ పార్టీకి చెందిన వారు. దీంతో క‌న్న‌డ నాట అసెంబ్లీ నుంచి 17 మందిపై వేటు ప‌డిన‌ట్ల‌యింది. అంతే కాకుండా ..వేటుకు గురైన వారంతా నాలుగు సంవ‌త్స‌రాల పాటు ఎటువంటి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా స్పీక‌ర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో షాక్ కు గుర‌వ‌డం బీజేపీతో పాటు ఎమ్మెల్యేల వంతైంది. డిస్ క్వాలిఫై విష‌యాన్ని స్వ‌యంగా మీడియా ముందు రమేష్ కుమార్ ప్ర‌క‌టించారు. స్పీక‌ర్‌గా త‌న‌కు విశేష‌మైన అధికారాలు ఉన్నాయ‌ని, తాను రాజీనామా చేసే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. తిరిగి క‌న్న‌డ నాట క‌థ మ‌ళ్లీ మొద‌లైంది. యెడ్డీ స‌ర్కార్ ఉంటుందా లేక స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!