సామాన్యుడిదే విజ‌యం..కేజ్రీదే రాజ్యం

స‌మాచార హ‌క్కు చ‌ట్టం భార‌త రాజ్యాంగం పౌరుల‌కు క‌ల్పించిన ప్రాథ‌మిక హ‌క్కు. దేశ వ్యాప్తంగా త‌మకంటూ ఎదురే లేకుండా చేసుకుంటూ వ‌స్తున్న మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి దిమ్మ తిరిగేలా చేసిన చ‌రిత్ర ఆమ్ ఆద్మి పార్టీకే ద‌క్కింది. ఎలాంటి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేయ‌కుండా కేవ‌లం అభివృద్ధి మంత్రం మాత్ర‌మే జ‌పిస్తూ వ‌చ్చిన ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ సాధించారు. ముచ్చ‌ట‌గా మూడోసారి ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. బీజేపీకి చెందిన మంత్రులు, ముఖ్య‌మంత్రులు, సీనియ‌ర్ నాయ‌కులతో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షాతో పాటు ప‌లువురు సీనియ‌ర్ దిగ్గ‌జాలు సైతం ఢిల్లీలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ప్ర‌చారం చేప‌ట్టారు. అయినా వీరి పాచిక‌లు పార‌లేదు. వ్యూహాలు ఫ‌లించ‌లేదు. ఢిల్లీ ఓట‌ర్లు మాత్రం మాయ మాట‌లు, హామీలను న‌మ్మ‌లేదు.

బీజేపీ మాత్రం ఎలాగైనా స‌రే ఈసారి కేజ్రీవాల్ ను గ‌ద్దె దించాల‌ని శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. భార‌తీయ జ‌న‌తా పార్టీతో పాటు కాంగ్రెస్, ఇత‌ర పార్టీలు సైతం ఎన్నిక‌ల బ‌రిలో నిలిచాయి. మొత్తం 70 సీట్ల‌కు గాను అధికార పార్టీ మ‌రోసారి త‌న విజ‌య‌పు జెండాను స‌గ‌ర్వంగా ఎగర వేసింది. అతిర‌థ మ‌హార‌థులు ఎల‌క్ష‌న్ క్యాంపెయిన్ లో పాల్గొన్నా ప‌ట్టుద‌ల‌తో ఓడించాల‌ని చూసినా చివ‌రి క్ష‌ణంలో బొక్క బోర్లా ప‌డ్డారు. ఆప్ మాత్రం చాప కింద నీరులా ఢిల్లీలో మ‌రోసారి త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. అడుగ‌డుగునా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మొద‌టి ప్లేస్‌లో నిలిచింది. ఉచితంగా విద్యుత్, నిరంత‌రం నీటి స‌ర‌ఫ‌రా, మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా ఉచితంగా ర‌వాణా సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించారు. అంతే కాకుండా షి టీంల‌ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ వాసుల కోసం ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టారు ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్. ఉప ముఖ్య‌మంత్రి సిసోడియా సైతం గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు.

చివ‌రకు బీజేపీ అభ్య‌ర్థిపై ఎట్ట‌కేల‌కు గెలుపొందారు. డ‌బుల్ డిజిట్ సీట్లు గెలుపొందుతామ‌ని, ప‌వ‌ర్‌లోకి వ‌స్తామ‌ని బీరాలు ప‌లికిన బీజేపీ నాయ‌క‌త్వానికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు కేజ్రీవాల్. బీ కూల్, బీ పాజిటివ్ ప్రాతిప‌దిక‌గా ఢిల్లీ సిఎం ప్ర‌చారం చేప‌ట్టారు. ఢిల్లీ ప్ర‌జ‌లు మాత్రం ప్ర‌ధాని మోడీ మాట‌ల‌ను న‌మ్మ‌లేదు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్‌ల ప్ర‌లోభాల‌ను ప‌క్క‌న పెట్టారు. ఘ‌న విజ‌యం సాధించేలా ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ్డారు అర‌వింద్. నిన్న‌టి దాకా ఆప్ ను టార్గెట్ చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మ‌రోసారి త‌న‌పై చూపు సారించ‌కుండా చేశారు కేజ్రీవాల్. దీంతో ఆప్ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో, ఏపాటిదో ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించింది. త‌మ ప్ర‌భుత్వం ఏది చెబుతుందో అదే చేస్తామంటూ స్ప‌ష్టం చేయ‌డంతో ఆప్ ప‌వ‌ర్‌లోకి వ‌చ్చింది. కాగా ఆప్ హ‌స్తిన‌లో గెల‌వ‌డం దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌లో కొలువు తీరిన‌, తీరాల‌ని అనుకుంటున్న ప్రాంతీయ పార్టీల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చిన‌ట్ల‌యింది. 

కామెంట్‌లు