కరోనాపై ఫ్యాన్స్ ఫైర్
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలతో పాటు క్రీడారంగం కూడా కుదుపునకు లోనైంది. ప్రపంచాన్ని ఇప్పటికే గడగడలాడిస్తున్న ఈ వైరస్ దెబ్బకు క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, వాలీబాల్, చెస్, ఫుట్ బాల్, బేస్ బాల్, హాకీ, తదితర అన్ని ఆటలు అర్ధాంతరంగా రద్దయ్యాయి. ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న ఒలంపిక్ గేమ్స్ కూడా జరుగుతాయో లేదోనన్న మీమాంస నెలకొంది. మరో వైపు ఇండియాకు ఐకాన్‌గా ఉన్న క్రికెట్ కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అసాధరణ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇండియన్ ప్రిమియర్ లీగ్ పోటీలు జరగాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడంతో తప్పని పరిస్థితుల్లో తాము కూడా తాత్కాలికంగా అన్ని మ్యాచ్‌లను, టోర్నమెంట్ లను రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ చీఫ్ సౌరబ్ గంగూలీ వెల్లడించారు. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లనుంది. అంతే కాకుండా స్పాన్సర్స్ చేస్తున్న కంపెనీలు సైతం భారీగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రద్దు చేయడం కాకుండా వాయిదా మాత్రం వేయాలని కోరుతున్నాయి.
దీనిని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అంతే కాకుండా తాజాగా ఐపీఎల్ టోర్నమెంట్ కు సంబంధించి మ్యాచ్‌లను ఎట్టి పరిస్థితుల్లోను నిర్వహించే ప్రసక్తి లేదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కోట్లాది మంది క్రికెట్ అభిమానులు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. తమను మ్యాచ్‌లు చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరుతున్నారు. కరోనా వైరస్ వ్యాధిని అడ్డం పెట్టుకుని అసలైన క్రికెట్ ఆటను ఆస్వాదించనీయకుండా చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. దీనిపై బీసీసీఐ చీఫ్ గంగూలీ అభిమానుల కోసం కొంత వివరణ కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, దయచేసి తమ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ఫ్యాన్స్ ప్రయత్నం చేయాలంటూ కోరారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికిప్పుడు డిసిషన్ తీసుకున్నామని గంగూలీ చెప్పారు.
దేశ ప్రధానమంత్రి మోదీజీ చేసిన విజ్ఞప్తి మేరకు క్రికెట్ ఆటకు సంబంధించి ఐపీఎల్, టెస్ట్, వన్డే, బెనిఫిట్ మ్యాచ్‌లు, టోర్నమెంట్‌లను వాయిదా వేస్తున్నామని వైరస్ కంట్రోల్ అయ్యాక, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ముందస్తు నిర్ణయం తీసుకున్నా అది అందరిపై ప్రభావం చూపుతుందన్నారు. ఆట కంటే దేశ భవిష్యత్తు ముఖ్యమన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని క్రికెట్ అభిమానులకు గుర్తు చేశారు. దేశం తర్వాతే ఏదైనా..ఎవరైనా. ఏ ఆటకైనా. ప్రజలందరు బాగుండాలని తాము సైతం కోరుకుంటున్నామని చెప్పారు. కరోనా వైరస్ అదుపులోకి వచ్చేంత దాకా తాము సైతం సపోర్ట్ చేయడం జరుగుతుందన్నారు. మ్యాచ్‌లను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయాన్ని ఈ మేరకు బీసీసీఐ తరపున కేంద్ర ప్రభుత్వానికి నివేదించామన్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం సంతోషకరమన్నారు. ఇప్పటికిప్పుడు మ్యాచ్‌ల నిర్వహణపై ఏమీ చెప్పలేమన్నారు. ఆట కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి