ఆకలి కేకల్లో వెనిజులా.. ఆదుకునేది ఎలా..?

ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ నిల్వలు కలిగిన దేశంగా పేరొందిన వెనిజులా ఇప్పుడు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. లక్షలాది  మంది అన్నమో రామ చంద్ర అంటూ మొత్తుకుంటున్నారు. వందలాది మందికి కూడుతో పాటు గూడు కూడా కరువైంది. చేసేందుకు పనులు లేవు, ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అన్నింటిని ఉచితంగా ఇస్తూ పోయింది.  దీంతో జనం ఎక్కువ శాతం పని చేయకుండా సోమరులుగా తయారయ్యారు. దక్షిణ అమెరికాలో వుండే ఈ దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే . ఆ దేశం ఇలా పేద దేశంగా తయారు కావడానికి అగ్ర రాజ్యం అమెరికా కూడా ఒక కారణం. ప్రపంచంలో యుఎస్ కు తాను బతికినన్నాళ్లు ఆ దేశ ప్రెసిడెంట్ కు నిదుర లేకుండా చేసిన ఘనత క్యూబా మాజీ ప్రెసిడెంట్ ఫెడరల్ కాస్ట్రో.

ఆయన బతికి ఉన్నన్నాళ్ళు వెనిజులా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీస్ కు వెన్ను దన్నుగా నిలిచారు. అయినా ఫలితం లేక పోయింది. వెనుజులాను గొప్ప కంట్రీగా తీర్చి దిద్దిన హ్యూగో చావెజ్ మరణించడం తో,  అటు అమెరికాకు అడ్డు లేకుండా పోయింది. ఆ దేశంలో ఉన్న ఆయిల్ నిల్వలపై కన్నేసింది. అంతర్జాతీయ పరంగా ఆయిల్ ధరలు తగ్గడంతో పన్నుల రూపేణా వచ్చే డబ్బులన్నీ తగ్గి పోయాయి. తిండి నుంచి బట్టల దాకా అన్నిటిని తక్కువ ధరకే సబ్సిడీపై ప్రభుత్వం ప్రజలకు అందజేస్తూ పోయింది. దీంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యింది. ఉన్న ఆయిల్ నిల్వలు పేరుకు పోవడం , జనం అవసరాలు పెరిగి పోవడం తో ఆర్ధిక మాంద్యం ఏర్పడింది. పనులు లేవు, తినేందుకు తిండి లేదు, కట్టుకునేందుకు దుస్తులు లేవు.

ప్రజలతో పాటు వేలాది మంది చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. వృద్దులు, మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొన్ని దేశాలు సాయం ప్రకటించినా  అది ఏపాటికి సరి పోవడం లేదు. పరిస్థితిని చక్క సిద్ధేందుకు ప్రెసిడెంట్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో ఆర్ధిక సంక్షోభం తో పాటు సర్కార్ కు వ్యతిరేకంగా ప్రజలు ఎదురు తిరిగే రోజు దగ్గర్లోనే ఉంది. దీనిని అధిగమించేందుకు అగ్ర రాజ్యాలు , యుఎన్ ప్రయత్నాలు చేయక పోవడం బాధ కలిగిస్తోంది. ప్రపంచంలో వెనిజులా ఒక్కటే కాదు దాయాది పాకిస్తాన్ , ఇండియా , తెలంగాణ సర్కార్లు ఆలోచించాలి. సబ్సిడీలతో ఎంత కాలం ప్రజలను జోకొడతారు . పని చేసేలా చేయాలి. లేకపోతే మనకూ తిండి దొరకని పరిస్థితి ఎంతో దూరం లేదు కదూ. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!