టెలికం కంపెనీలకు ఊరట

ఇండియాలో టెలికం సేవల పేరుతో వినియోగదారుల నెత్తిన శఠగోపం పెట్టిన ఆయా టెలికం దిగ్గజ కంపెనీలకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది సుప్రీం కోర్టు. సవరించిన స్థూల ఆదాయం కింద బాకీ పడిన మొత్తాలను చెల్లించాల్సిందేనంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో విదేశీ టెలికం కంపనీలు లబోదిబోమంటున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు భారత దెస ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. అన్ని కంపెనీలు తమ సేవలను కొనసాగించాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని స్పష్టం చేశారు. పలు అంశాలను ప్రస్తావించారు.

ఆర్థిక స్థిరత్వ లేమి కారణంగా ఏ కంపెనీ తమ సేవలను నిలిపి వేయకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందడమే తమ అభిమతమని అన్నారు. టెలికం నష్టాలకు  సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు కార్యదర్శుల కమిటీని నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మరోవైపు టెలికం సంక్షోభాన్ని ప్రభుత్వం పట్టించు కోకుంటే భారత్‌లో పెట్టుబడుల పెట్టే విషయంలో పునరాలోచిస్తామని వొడాఫోన్‌ సీఈఓ నిక్‌ రెడ్‌ స్పష్టం చేశారు.

ఏజీఆర్‌పై సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెను భారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో వొడాఫోన్‌ ఐడియా 50,921 కోట్లు, ఎయిర్‌టెల్‌ కంపెనీ  23,045 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించాయి. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సి ఉంటుంది.  ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారు 74,000 కోట్లకు చేరింది.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!