మరాఠా పీఠం సేనదే

ఇండియన్ ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా ఎత్తులు పారలేదు. ముందు  నుంచి చెబుతున్నట్టుగానే శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే మరాఠా పీఠాన్ని అధీష్టించ బోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పోటీ నుంచి తప్పు కోవడంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. మూడు పార్టీలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందించి, చివరకు ఓ అంగీకారానికి వచ్చాయి. ఐదేళ్ల​ పాటు సీఎం పీఠం శివసేనకు అప్పగించి, డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్‌, మంత్రి పదవులు చెరి సమానంగా పంచు కునేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ సిద్ధమయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్‌ అంగీకారం తెలిపితే కొద్ది గంటలోపే శివసేన నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎం పీఠం సేనదే అని ఖరారైనా, సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఉద్దవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్యా ఠాక్రేనే సీఎం అని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. బీజేపీతో తెగదెంపుల అనంతరం సమీకరణాలు మారి పోయాయి.

ఆదిత్యాను సీఎం అభ్యర్థిగా ఎన్నుకునేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కనీస అనుభవం లేక పోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. బీజేపీని సమర్థవంతగా ఎదుర్కోగల శక్తీ, సామర్థ్యాలు ఆదిత్యాకు లేవని ఓ వర్గం నేతల వాదన. ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం అభ్యర్థి అయితేనే తాము మద్దతు తెలుపుతామని ఎన్సీపీ, కాంగ్రెస్‌ షరతు విధించినట్లు సమాచారం. మొత్తం మీద శివ సేన తాను అనుకున్నట్టు గానే పవర్ లోకి రాబోతోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!