సరిలేరు కోసం ఫ్యాన్స్ వెయిటింగ్


టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబుకు ఓ ప్రత్యేకత ఉంది. అయన టైమింగ్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మిగతా హీరోలకు  చాలా తేడా ఉంటుంది. ఎవ్వరి విషయాల్లో తల దూర్చడు. తానేదో తన పని ఏదో చేసుకుంటూ పోతారు. అందుకే చాలా మంది నటీమణులు మహేష్ బాబు తో ఒక్క సినిమా అయినా చేయాలని ఆరాట పడతారు. ఇక బాలీవుడ్ తారలైతే ఏకంగా ప్రిన్స్ తో ఒక్కసారైనా నటించాలని ఉందంటూ తెగ ముచ్చట పడ్డారు. అంతే కాదు బహిరంగంగానే తమ ఒపీనియన్స్ పంచుకున్నారు కూడా. మహేష్ బాబు ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్. ఆయన రేంజ్ ఇటీవల మరింతగా పెరిగింది. ప్రిన్స్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టర్స్రి లీజ్ చేశారు. టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతోంది. త్వరలోనే టీజర్ లోడ్ అవుతోందంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. హీరో మహేశ్‌బాబు గన్‌ లోడ్‌ చేస్తున్న క్లిప్‌ను షేర్ చేసి టీజర్ లోడ్ అవుతోంది అంటూ కామెంట్‌ పెట్టారు. అయితే టీజర్‌ ఏ తేదీన విడుదలవుతుందో ఇంకా వెల్లడించలేదు. వచ్చే వారం టీజర్‌ బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. సరిలేరు నీకెవ్వరు టీజర్‌, మాస్‌ఎంబీ హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు మహేశ్‌బాబు, విజయశాంతి పోస్టర్లు, ఎంట్రీ సాంగ్‌ టీజర్‌ను మాత్రమే విడుదల చేశారు. ఈ చిత్రం టీజర్‌ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

వరుస విజయాలతో సక్సెస్‌పుల్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతేడాది సంక్రాంతికి ‘ఎఫ్‌2’ సినిమాతో విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ మహేశ్‌బాబుతోనూ హిట్‌ కొట్టాలని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ ప్రయత్నిస్తోంది. మహేశ్‌బాబు ఆర్మీ మేజర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో ఆయనకు జోడిగా రష్మిక మందాన నటించారు. రాజేంద్రప్రసాద్‌, విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, ఆది పినిశెట్టి, వెన్నెల కిశోర్‌, అనుసూయ భరద్వాజ్‌ తదిరులు ఇతర పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

కామెంట్‌లు