టీమిండియా బిగ్ విక్టరీ
బంగ్లాతో జరుగుతున్న టెస్టులో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రత్యర్థి ఏ జట్టు అయినా సరే భారత క్రికెట్ జట్టు సునాయాసంగా గెలుస్తూనే ఉన్నది. రికార్డులు తిరుగ రాస్తున్నది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఆరంభమైన తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆరంభపు టెస్టులో భారీ విజయం సాధించి శుభారంభం చేసింది. బంగ్లాతో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే ఆలౌట్ చేసి భారీ విజయాన్ని అందుకుంది.
బంగ్లా ఆటగాళ్లలో ముష్ఫికర్ రహీమ్ 64 మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను మూడో రోజే ముగించింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు సాధించగా, అశ్విన్ మూడు వికెట్లతో మెరిశాడు. ఉమేశ్ యాదవ్‌కు రెండు, ఇషాంత్‌కు వికెట్ లభించింది. ఆటలో భాగంగా 493/6 ఓవర్ నైట్ స్కోరు వద్ద భారత్ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్ ఇస్లామ్, ఇమ్రుల్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తలో ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కెప్టెన్ మోమినుల్ హక్, మహ్మద్ మిథున్ లు సైతం నిరాశ పరిచారు. దీంతో బంగ్లా తేరు కోలేక పోయింది. ముష్ఫికర్ రహీమ్ ప్రతిఘటించడంతో బంగ్లా గాడిలో పడినట్లు కనిపించింది. ఒకవైపు ముష్పికర్ ఆడినా మరొక వైపు వికెట్లు కోల్పోతూ వచ్చింది. ముష్పికర్ రహీమ్ తర్వాత లిటాన్ దాస్, మెహిదీ హసన్ లు మోస్తరుగా ఆడారు. రహీమ్ 9వ వికెట్‌గా పెవిలియన్ చేరిన కాసేపటికే బంగ్లా కథ ముగిసింది. బంగ్లా ఆఖరి వికెట్‌గా ఎబాదత్ హుస్సేన్ ఔట్ కావడంతో భారత్‌కు భారీ విజయం దక్కింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి