మనోడే మహారాజు..సిప్లిగంజ్ విన్నర్
ప్రముఖ సింగర్ రాహల్ సిప్లిగంజ్ స్టార్ మా టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ - 3 విన్నర్ గా నిలిచారు. ఎంతో ఉత్కంఠ రేపుతూ వచ్చిన ఈ షో తెలుగు బుల్లి తెర మీద టాప్ పొజిషన్ లో నిలిచింది. టీఆర్ఫీ రేటింగ్ లో నంబర్ వన్ లో నిలిచింది. ఎవరూ ఊహించని రీతిలో రాహుల్ దుమ్ము రేపాడు. తన గానంతో, మాటలతో, ఆటతో ఆకట్టుకున్నారు. లక్షలాది మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. రాహుల్..శ్రీ ముఖిల మధ్య ఫైనల్ పోటీలో నిలిచారు. ఆఖరి ఆటలో అదృష్టం మనోడిని వరించింది. అరే ఆడు అంటూ నన్ను పునర్నవి సపోర్ట్ చేసిందని చెప్పారు సిప్లిగంజ్. నాగార్జున, చిరంజీవిల చేతుల మీద ఈ పురస్కారం తీసు కోవడంతో తన జన్మ ధన్యమైందన్నారు.
ఇదిలా ఉండగా, ఎంతో టెన్షన్ క్రియేట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ - 3 గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. సైరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరంజీవి సైరా బ్యాక్‌గ్రౌండ్ పాటతో అదరిపోయేలా గ్రాండ్ ఫినాలెకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ -3 విజేత ఎవరు అనేది మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. 17 మంది ఈ రియాల్టీ షో లో పాల్గొన్నారు. చివరకు ఐదుగురు మాత్రమే మిగిలారు. వీరిలో బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్, శ్రీ ముఖి, రాహుల్ ఉన్నారు. మొదటగా అలీ రెజా ఎలిమినేటి కాగా, వరుణ్, బాబా భాస్కర్ వైదొలిగారు. చివరి వంతుగా రాహుల్ శ్రీ ముఖి నిలిచారు. వారిని హౌస్ లోకి వెళ్లి నటుడు నాగార్జున వీరిద్దరిని స్టేజ్ పైకి తీసుకు వచ్చారు. చివరకు విజేతను ప్రకటించారు.
ఏకంగా ఎనిమిదిన్నర కోట్ల మంది ఓట్లు వేశారని హోస్ట్ నాగార్జున చెప్పారు. 5000000 లక్షల ప్రైజ్ మనీ చెక్కును రాహుల్ అందుకున్నాడు. తనను కన్నవారికి రుణపడి ఉన్నానని చెప్పాడు సిప్లిగంజ్. ఇదిలా ఉండగా హోస్ట్ నాగార్జునతో కలిసి చిరంజీవి బిగ్‌బాస్ గేమ్ షోలో సందడి చేశారు. శ్రీముఖి, రాహుల్‌లో ఎవరు గెలుస్తారంటూ హోస్ట్ నాగార్జుననే అడిగి.. చిరు ఇరకాటంలో నెట్టారు. మీరు అడగమన్నారా అంటూ హౌజ్ లోంచి బయట కొచ్చిన కంటెస్టెంట్లను అడుగుతూ నాగార్జున సరదాగా దాట వేశారు. నాగార్జున హౌజ్‌లోకి వెళ్లి ఫైనలిస్టులైన ఇద్దరు కంటెస్టెంట్లను వేదిక మీదకు తీసుకొచ్చారు. ఇక ఇస్మార్ట్ భామ నిధి అగ్వరాల్ తన దుమ్ము రేపే డ్యాన్సులతో గ్రాండ్ ఫినాలెకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆఖరు దాకా బిగ్ ఫైట్ ఇచ్చింది శ్రీ ముఖి.
వారానికి ఒక ఎలిమినేషన్ చొప్పున 105 రోజులపాటు సాగిన రియాటీ షో ఈసారి ప్రేక్షకులను గణనీయంగా అలరించింది. జులై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ త్రీ తెలుగు ప్రజలకు త్వరగానే చేరువైంది. తొలి రోజు నుంచే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ..15 వారాలపాటు ఒకే ఇంట్లో ఉంటూ ఎన్నో ఎమోషన్స్‌ను తట్టుకుంటూ ఐదుగురు ఇంటి సభ్యులు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో సక్సెస్ వెనుక నాగార్జున కృషి ఎంతగానో ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతకు ముందు నటుడు శ్రీకాంత్ క్యాష్ ఆఫర్ ఇచ్చారు. అయినా ఫైనలిస్టులు ఒప్పు కోలేదు. ఫైనల్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ విజేతగా నిలిచాడు రాహుల్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి