నిరుద్యోగ భారతం..ఆందోళనకరం
మేరా భారత్ మహాన్ అంటూ జనాన్ని బురిడీ కొట్టించి కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెడుతోంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగిత రేటు పెరిగిందని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వ విద్యాలయం తన అధ్యయనంలో పేర్కొంది. 2011-12, 2017-18 సంవత్సరాలలో దేశంలో 90 లక్షల మంది ఉపాధికి దూరమయ్యారని ఎంప్లాయిమెంట్ క్రైసిస్ తన నివేదికలో తెలిపింది. యువత, శ్రామికులు, విద్యా వంతులు నిరుద్యోగంలో మగ్గి పోతున్నారని స్పష్టం చేసింది. అసంఘటిత రంగానికి మెరుగైన ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపింది. సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమ రంగాలు సైతం ఏ విధమైన కాంట్రాక్టు లేకుండానే ఛాన్స్ ఇస్తున్నాయని వెల్లడించింది.
దేశంలో వ్యవసాయేతర రంగాలలో సేవల రంగం అత్యధిక ఉపాధిని కల్పిస్తున్నదని తెలిపింది. కానీ పెరుగుతున్న జనాభాకు, చదువుకున్న లక్షలాది విద్యార్థులకు ఆశించిన మేర అవకాశాలు దొరకడం లేదన్నది. వ్యవసాయ రంగం లో 27 మిలియన్ల మేర ఉపాధి క్షీణించింది అని పేర్కొంది. అనుబంధ రంగాలలో ఉపాధి వాటా కూడా 49 శాతం నుండి 44 శాతానికి పడి పోయిందని వెల్లడించింది. తయారీ యేతర రంగాలలో ముఖ్యంగా నిర్మాణ రంగంలో కేవలం 0.6 మిలియన్ జాబ్స్ మాత్రమే సృష్టించిందని పేర్కొంది.
యూత్ కు జాబ్స్ పరంగా చూస్తే యూపీ మొదటి స్థానంలో ఉండగా బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, అసోం తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ఇక సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు 68 శాతం ఉపాధిని కల్పిస్తున్నట్లు తెలిపింది. 2017-18 సంవత్సరం తయారీ రంగంలో 61 శాతం ఉపాధిని కల్పిస్తుండగా, తయారీ యేతర రంగాలలో 66 శాతం నుంచి 71 శాతానికి ఉపాధిని కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది సంస్థ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి