ఆర్టీసీ కార్మికులకు ఓవైసీ భరోసా

ఎంఐఎం పార్టీ అధినేత, పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. గత 30 రోజులుగా తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం అలుపెరుగని రీతిలో పోరాడుతున్నారు కార్మికులు. ఇప్పటికే 21 మంది అసువులు బాశారు. అయినా ప్రభుత్వం తరపు నుండి ఏ మాత్రం స్పందన రాలేదు. సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. అయినా కార్మికులు ఎవరూ ఒప్పు కోలేదు. సర్కారు దిగి వచ్చే దాకా, చర్చలు జరిపే దాకా తాము ఒప్పకోమని స్పష్టం చేశారు.

మరో వైపు ఎంపీ ఒవైసీ తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. దీనిపై ఓవైసీ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడారు. మీ బాధను అర్థం చేసుకోగలను. సమ్మె సమయంలో కొంత మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరం. తొందరపడి ప్రాణాలు తీసుకోకండి. సీఎం కేసీఆర్ మాటలను ఆలకించాలని కోరుతున్నాను. సీఎంతో కూర్చుని చర్చించండి.

కాంగ్రెస్, బీజేపీ నేతల ఉచ్చు లో పడకండి. ఆ రెండు పార్టీలకు సొంత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ భూమి మీది.. ఈ తెలంగాణ మీది అని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కార మవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్‌కి అసద్ ఓ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసినా, నంబర్ ప్లేట్‌లోని ‘జెడ్’ అనే అక్షరాన్ని మాత్రం తీసేయొద్దని కోరారు. అది చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా జ్ఞాపకార్థం పెట్టారని, హైదరాబాద్ చరిత్రలో అదొక భాగమని ఓవైసీ చెప్పారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!