డెడ్ లైన్ డోంట్ కేర్


సీఎం కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్స్ తమకు కొత్తేమి కాదని స్పష్టం చేసింది ఆర్టీసీ జేఏసీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే పరిస్థితి లేదని, సమ్మెపై అవాకులు చెవాకులు పేలడం మాను కోవాలన్నారు నాయకుడు అశ్వత్థామ రెడ్డి. ఉద్యోగులను తొలగించే అధికారం ఎవరికీ లేదని, డిమాండ్లను నెర వేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేబినెట్‌ సమావేశంలో తమ సమస్యల పరిష్కారంపై హామీ రాలేదని అన్నారు.

కోర్టులను సైతం సీఎం డిక్టేట్ చేస్తున్నారని మండిపడ్డారు. మొదటగా చర్చలు జరిపి కార్మికులకు డెడ్ లైన్ పెట్టాలని అన్నారు. ఉద్యోగాలు తీసే అధికారం సీఎంకు లేదని, డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీలో కూడా రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని, ప్రైవేటు పరమైతే వెనకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్లకు బుగ్గ కారులో తిరగాలనే సోకు లేదని, కార్మికుల డిమాండ్ల కోసమే యూనియన్లు పని చేస్తున్నాయని చెప్పారు.

ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి సీఎం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్మికులు నా బిడ్డలు అనుకుంటూనే కేసీఆర్ వారిని ఇబ్బంది పెడ్తున్నాడని మండి పడ్డారు. ఎవరో ఇద్దరు ముగ్గురు పిరికి వాళ్లు ఉద్యోగంలో చేరు తున్నారని, కార్మికులంతా ధైర్యంగాసమ్మెలో పాల్గొంటున్నారని వెల్లడించారు. త్వరలో కేంద్ర మంత్రి అమిత్ షా ను కలుస్తామని చెప్పారు. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళతామని చెప్పారు అశ్వత్థామ రెడ్డి. 

కామెంట్‌లు