దృశ్యం సంచలనం


లోకమే వాకిలి..మనసే లోగిలిగా మారి పోయింది ఈ ప్రపంచం. ప్రస్తుతం క్రియేటివిటీ ఉంటే చాలు లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇది అన్ని రంగాలకు విస్తరించింది. ఇండియా పరంగా చూస్తే సినిమా రంగం రాష్ట్రాలను, దేశ సరిహద్దులను దాటుకుని హాలీవుడ్ స్థాయికి చేరుకుంది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ, కొంకిణి, ఉర్దూ, తదితర భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వస్తున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో యంగ్ టాలెంట్ కాసులు కురిపించేలా చేస్తోంది.

మన సినిమాలు ఇతర దేశాలలో కూడా విడుదల అవుతున్నాయి. అమెరికా, దుబాయి, సౌదీ, చైనా, బ్యాంకాక్, థాయిలాండ్, జపాన్, ఇరాక్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, శ్రీలంక, నేపాల్, తదితర కంట్రీస్ లో భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇటీవల చైనాలో ఇండియన్ మూవీస్ కు ఆదరణ పెరుగుతోంది. ఇక ఇండియన్ సూపర్ స్టార్ తమిళ తలైవా, రజనీకాంత్ సినిమాలకు జపాన్ లో జనాదరణ ఎక్కువ. మిగతా హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇదిలా ఉండగా ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు మరో భాషలో రీమేక్‌ కావడం సాధారణం. ఈ మధ్య కాలంలో మలయాళ హిట్‌ సినిమా ‘దృశ్యం’ ఎక్కువ భాషల్లో  రీమేక్‌ అయింది. తాజాగా చైనీస్‌ భాషకి వెళ్లడం విశేషం.

మోహన్‌లాల్‌ హీరోగా జీతూ జోసెఫ్‌ రూపొందించిన థ్రిల్లర్‌ ‘దృశ్యం’. తెలుగులో వెంకటేశ్‌ దృశ్యం పేరుతో నటించగా, తమిళంలో కమల్‌ హాసన్‌ పాపనాశనం పేరుతో వచ్చిన మూవీలో నటించాడు. కన్నడంలో రవిచంద్రన్‌ దృశ్య పేరుతో,  హిందీలో అజయ్‌ దేవగన్‌ దృశ్యం పేరుతో  హీరోలుగా రీమేక్‌ చేశారు. అంతేకాదు.. సింహళీ శ్రీలంక భాషలో ‘ధర్మయుద్య’గా, ఇప్పుడు చైనీస్‌లో ‘షీప్‌ వితౌట్‌ ఏ షెపర్డ్‌’ అనే టైటిల్ తో రీమేక్‌ అయింది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 20న విడుదలవుతోంది. మొత్తం మీద మన సినిమాలకు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ లభిస్తోంది అన్నమాట. 

కామెంట్‌లు