నిమిషాల్లోపే గెలాక్సీ ఫోల్డ్ బుకింగ్
నిన్నటి దాకా మందకొడిగా సాగిన శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. డిఫ్ఫరెంట్ డిజైన్స్, సౌకర్యాలతో న్యూ లుక్ తో కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. ఆన్ లైన్ లో నిమిషాల్లో పే అమ్ముడు పోయాయి. మొబైల్ మార్కెట్‌లో భారీ వాటాను సొంతం చేసుకున్న భారత్ లగ్జరీ స్మార్ట్ ఫోన్ల విక్రయంలో శ్యాంసంగ్ రికార్డు నెలకొల్పింది. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన లగ్జరీ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది.
ప్రీ బుకింగ్‌లు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ హాట్ కేకుల్లా బుక్ అయి పోయాయి. అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-బుకింగ్‌లు మొదలు పెట్టిన 30 నిమిషాల వ్యవధిలో మొత్తం 1,600 యూనిట్ల గెలాక్సీ ఫోల్డ్ ప్రీమియం ఫోన్‌లను కంపెనీ విక్రయించింది. దీంతో ప్రీ బుకింగ్స్‌ను మూసి వేసింది. ఐఎఎన్‌ఎస్ అందించిన నివేదిక ప్రకారం, ఫోన్‌లను ముందే బుక్ చేసుకున్న కొనుగోలుదారులు మొత్తం 1,64,999 ముందస్తుగా చెల్లించి మరీ వీటిని సొంతం చేసుకోవడం విశేషం.
ఇక ఫోన్ విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ఆరు కెమెరాలతో పని చేస్తుంది. 4.6 అంగుళాల సింగిల్ ఫోల్డ్ అమోలెడ్ డిస్‌ప్లే. 7.3 అంగుళాల వరకు విస్తరిస్తుంది. బయటి 21: 9 స్క్రీన్ 840 -1960 రిజల్యూషన్ , మరో స్క్రీన్ 1,536 - 2,152 రిజల్యూషన్ కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది ఈ మొబైల్ లో. కాగా సౌత్ కొరియా కంపెనీకి అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీ మొబైల్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి