ఇన్వెస్ట్రర్స్ కు భలే ఛాన్స్
ఇండియన్ మార్కెట్ రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న కంపెనీగా అవతరించింది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ కంపెనీ మరో రికార్డు నమోదు చేసింది. మదుపు చేసిన ఏ ఒక్కరు ఇప్పటి దాకా నష్ట పోలేదు. ఇది కూడా ఓ చరిత్రే. గత ఐదేళ్ళలో అత్యంత సంపదను సమకూర్చిన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఈ కంపెనీ 5.6 లక్షల కోట్ల మేర విలువను పెంచుకున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ తేల్చింది. అధికంగా సంపద తెచ్చి పెట్టిన కంపెనీల్లో.. మొదటి 100 కంపెనీలు కలసి 2014–19 కాలంలో సమకూర్చిన సంపద 49 లక్షల కోట్లుగా ఉంది. ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కాలంలో 5.6 లక్షల కోట్ల విలువను సమకూర్చి అత్యధిక సంపద సృష్టికర్తగా అవతరించింది.
చరిత్రలో ఇప్పటి దాకా ఇదే అత్యధిక రికార్డు అని నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్ల కాలంలో అత్యధికంగా, అత్యంత వేగంగా, నిలకడగా సంపద సమ కూర్చిన టాప్ 3 కంపెనీలుగా ఆర్‌ఐఎల్, ఇండియా బుల్స్ వెంచర్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు నిలవగా... వేగంగా సంపద తెచ్చి పెట్టిన వాటిల్లో ఇండియా బుల్స్ వెంచర్స్ వరుసగా రెండో సారి మొదటి స్థానం సంపాదించడం గమనార్హం. ఈ షేరు గత ఐదేళ్లలో వార్షికంగా 78 శాతం కాంపౌండెడ్ రాబడులను తెచ్చి పెట్టింది. టాప్ 10 సంపద సృష్టికర్తల్లో బజాజ్ ఫైనాన్స్ స్థానం ప్రత్యేకమని తెలిపింది. ఇండస్ ఇండ్ బ్యాంకు 2009–19 కాలంలో కాంపౌండెడ్‌గా 49 శాతం చొప్పున స్థిరంగా సంపదను సృష్టించింది.
ఇక 2014–19 కాలంలో సెన్సెక్స్ కాంపౌండెడ్ వార్షిక రాబడి 12 శాతంగా ఉంది. ఫైనాన్షియల్ రంగం కీలక భూమిక పోషించింది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలే ఈ రంగాన్ని నడిపించాయి. కాకపోతే, ఇదే విభాగంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం వాటాదారుల సంపదకు నష్టం చేకూర్చాయి. టాప్ 100 సంపద సృష్టికర్తల్లో ప్రభుత్వరంగ సంస్థలు కేవలం తొమ్మిదే చోటు సంపాదించాయి. అవి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, ఇంద్రప్రస్థ గ్యాస్, ఎల్‌ఐసీ హౌసింగ్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్‌బీసీసీ. మొత్తం మీద రిలయన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పెరుగుతాయన్న మాట.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి