వేలంపాటలో వీరులెవ్వరో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పండుగ రానే వచ్చింది. టోర్నీలో దుమ్ము రేపేందుకు వరల్డ్ వైడ్ గా టాప్ పొజిషన్ లో ఉన్న ఆటాగాళ్ళ వేలానికి రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయానికి వేళయింది. ఐపీఎల్ 2020 సీజన్ ఆట కోసం ఆటగాళ్ల వేలం పాట జరగనుంది. భారత యువ క్రికెటర్లతో పాటు ప్రధానంగా ఆ్రస్టేలియా, వెస్టిండీస్ ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు కన్నేశాయి. అయితే ఇందులో ధరలు పలికే ధీరులు ఎందరో తేలాలంటే వేలం ముగిసే దాకా ఎదురు చూడాలి. ఓవరాల్‌గా ఎనిమిది జట్లలో మొత్తం 73 ఖాళీలుండగా, ఈ వేలంలో 332 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.
ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు ఆటగాళ్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, లిన్, మిచెల్ మాల్స్, కమిన్స్, హాజల్‌వుడ్‌లకు అత్యధిక మొత్తం లభించే అవకాశముంది. కరీబియన్ హిట్టర్ హెట్‌మైర్ ప్రధాన ఆకర్షణ కావొచ్చు. ప్రస్తుతం అతను అసాధారణ ఫామ్ కనబరుస్తుండటంతో ఎంతైనా వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు రెడీ అంటున్నాయి. టెస్టులకు పరిమితమైన హనుమ విహారి, పుజారా 50 లక్షల ప్రాథమిక ధరతో ఉన్నారు.
గత సీజన్‌లో ఢిల్లీకి ఆడిన విహారిని విడుదల చేయగా పుజారాను ఎవరూ కొనలేదు. ఈసారి ఐపీఎల్ వేలంలో ఆంధ్ర నుంచి విహారి, భరత్, రికీ భుయ్, స్టీఫెన్, పృథ్వీరాజ్, ఇస్మాయిల్ బరిలో ఉండగా, హైదరాబాద్ నుంచి సందీప్, తిలక్ వర్మ, యుద్‌వీర్, మిలింద్ ఉన్నారు. మొత్తం మీద వేలం పాటలో ఎవరిని అదృష్టం వరిస్తుందోనని ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు. ఆయా క్రికెటర్లు ఇప్పటికే వివిధ ఫార్మాట్ లలో పెర్ఫార్మెన్స్ కనబరిచారు. ఈసారి గతంలో కంటే తగ్గినా, కేవలం పంచ్ హిట్టర్స్ నే ఫ్రాంచైజీలు ఎంచుకోనున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి