విశాఖలో పరుగుల సునామీ
మొదటి వన్డేలో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. విశాఖలో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఇరు జట్లు పరుగుల వరద పారించాయి. సాగర తీరం సునామీతో హోరెత్తింది. ఫోర్లు, సిక్సర్లతో పోటెత్తింది. బంతులు వేగంగా బౌండరీలు దాటాయి. చెన్నైలో దెబ్బ తిన్న టీమిండియా తగిన రీతిలో రిప్లై ఇచ్చింది. రోహిత్, రాహుల్ రెచ్చి పోతే అయ్యర్, పంత్ లో దూకుడు పెంచడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇండియన్ బౌలర్లు తమదైన శైలిలో విండీస్ ను కట్టడి చేశారు. హోప్, పూరన్ పోరాడినా ఫలితం లేక పోయింది.
ఈ వన్డేలో ఏకంగా ఇరు జట్లు కలిసి 667 పరుగులు చేస్తే, 29 సిక్సర్లు కొట్టారు. ఈ మ్యాచ్ లో 107 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. రోహిత్ శర్మ మరోసారి తన ప్రతిభ చూపాడు. 138 బంతుల్లో 159 పరుగులు చేశాడు. రాహుల్ 104 బంతుల్లో 102 పరుగులు చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 227 పరుగులు జోడించారు.
అనంతరం బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ 32 బంతుల్లో 53 పరుగులు చేస్తే, రిషభ్ పంత్ 16 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఇండియా భారీ స్కోర్ చేసింది. ఇక టార్గెట్ ఛేదనలో విండీస్ చతికిల పడింది. 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. షై హోప్ 78, నికోలస్ పూరన్ 75 పరుగులు చేస్తే కీమో పాల్ 46 పరుగులతో రాణించాడు. షమీ, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు. కుల్దీప్ హ్యాట్రిక్ సాధించడం విశేషం. తన్న బ్యాటింగ్ దెబ్బతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక మూడో వన్డే నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి