బరువుతోనే ఇబ్బంది

సినిమాల్లో రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు. దానికి మించి అందం, అభినయం ఉండాలి. ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో కొనసాగిన అనుష్క తాజాగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తీయబోయే సినిమాకు ఎంపికైంది. గౌతమ్ సినిమా అంటేనే వెరీ వెరీ స్పెషల్. మిగతా దర్శకులు వేరు..మీనన్ సినిమాలు వేరు. ఇదిలా ఉండగా అనుష్క ఈ మధ్య లావెక్కింది. అయితే ఎంత అందం ఉన్నా దానికి బరువు పెద్ద భారమే అవుతుంది. అలాంటి అందమైన నాజూకుతనాన్ని అనుష్క సైజ్‌ జీరో చిత్రం కోసం త్యాగం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత బరువు తగ్గడానికి నానా తంటాలు పడింది. కసరత్తులు, యోగా వంటివి చేయాల్సినంతా చేసింది. చివరికి అమెరికాకు వెళ్లి ఆధునిక వైద్యం చేయించుకుంది.

ఇందు కోసం కొంత కాలం నటనకు దూరం అయింది కూడా. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. సైజ్‌ జీరో చిత్రం తరువాత బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో కూడా నటించింది. బాహుబలి 2లో అనుష్కను స్లిమ్‌గా చూపించడానికి ఈ చిత్ర యూనిట్‌ గ్రాఫిక్స్‌ను ఉపయోగించక తప్ప లేదు. అందుకు భారీగానే ఖర్చు చేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రాజమౌళి బహిరంగంగానే చెప్పారు. ఆ తరువాత అనుష్క నటించిన భాగమతి చిత్రానికి వీఎఫ్‌ఎక్స్‌తో అనుష్క బరువును మ్యానేజ్‌ చేశారు. తాజాగా ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రం సైలెన్స్‌. మొత్తం ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో నిశ్చబ్దం అనే పేరును నిర్ణయించారు. ఇందులో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే ఇంతకు ముందు కంటే కొంచెం బరువు తగ్గిందని చెప్పవచ్చు.

అయినా తనను సన్నగా చూపించాలని, బాహుబలి 2 చిత్రం తరహాలో గ్రాఫిక్స్‌ను ఉపయోగించాలని సైలెన్స్‌ చిత్ర నిర్మాతలకు అనుష్క చెప్పిందని సమాచారం. స్వయంగా ఆమె చెప్పడంతో నిర్మాతలు కాదనగలరా. ఇప్పుడు సైలెన్స్‌ చిత్రంలో అనుష్కను స్లిమ్‌గా, మరింత అందంగా చూపించడానికి చిత్ర వర్గాలు తంటాలు పడుతున్నారని సమాచారం. కాగా అనుష్క తదుపరి గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. అందుకు తనను తాను తయారు చేసుకునే పనిలో ఉందట. మొత్తం మీద బరువు అన్నది నటీమణులకు శాపంగా మారిందన్న మాట. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!