మహేష్ ను మరిచి పోలేను
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అంటే యూత్ కు ఏమా క్రేజ్. ఆయన మోము, నవ్వు ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకే అమ్మాయిలకు తెగ నచ్చుతాడు. ఇక హీరోయిన్స్ సంగతి చెప్పక్కర్లేదు. ఒక్కసారైనా ఆయనతో నటిస్తే చాలనుకుని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వారిలో తాజాగా గీత గోవిందం ఫెమ్ రష్మిక మందన్న కూడా చేరి పోయారు. ఈ అమ్మడు కొద్దీ సినిమాల్లోనే నటించినా ఏకంగా మహేష్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతే కాదు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సరిలేరు నీకెవ్వరూ అంటూ మనల్ని పలకరిస్తుంది. ఈ అమ్మడు మహేష్ ను పొగడ్తలతో ముంచెత్తింది. తాజాగా జరిగిన ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి తనను కాంట్రాక్ట్ ఏమైనా చూసుకున్నావా అంటూ సరదాగా కామెంట్ చేశారు.
నేను చాలా సెటిల్డ్ యాక్టర్‌ని. డియర్ కామ్రేడ్ సినిమాలో చాలా ఎమోషనల్‌గా నటించాను. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఫుల్ ఎనర్జీ ఉన్న పాత్ర చేశాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రయోగాలు చేస్తున్నాను అన్నారు రష్మికా మందన్నా. దర్శకుడు అనిల్ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఆయన కథను మొత్తం యాక్ట్ చేసి చూపిస్తారు. ఈ సినిమాలో నా పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు. నా పాత్రకో ముగింపు కూడా ఉంటుంది. సినిమాలో మంచి ఫీల్ ఉంది. మహేశ్‌బాబు, విజయశాంతిగారితో కలసి యాక్ట్ చేయడం నాకు పెద్ద బోనస్. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నా పాత్ర చాలా డ్రమాటిక్‌గా ఉంటుంది. హీరో వెంట పడి అల్లరి చేసే పాత్ర నాది. చాలా హైపర్ యాక్టివ్.
ఫుల్ లెంగ్త్ నవ్వించే పాత్ర నాది. ట్రైన్ ఎపిసోడ్‌లో మహేశ్‌బాబు పాత్రను నా పాత్ర చాలా టార్చర్ పెడుతుంది. ఈ సినిమాలోనే కాదు సెట్లోనూ అందర్నీ టార్చర్ పెట్టాను. సెట్లో అందరూ కామ్‌గా ఉంటే అందర్నీ డిస్ట్రబ్ చేస్తుంటాను. అదే నా బలం అనుకుంటున్నాను. ఈ సినిమా ట్రైలర్‌లో కనిపించినంత హైపర్‌గా నిజ జీవితంలో ఉండను. మా దర్శకుడు చెప్పినట్లు చేశాను. మీరు చేసి చూపించండి, దాన్ని కాపీ కొడతాను అని చెప్పి కాపీ కొట్టేశా. కాపీ అంటే పూర్తి కాపీ కాదు. ఆయన చెప్పినదానికి కొంచెం నా స్టయిల్ జత చేసి నటించాను. విజయశాంతితో నాకు ఎక్కువ సన్నివేశాలు లేవు. మొదట్లో ఆమెతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ పడ్డాను.
ఆమెను లేడీ అమితాబ్ అంటారు కదా. అలాగే సీనియర్ యాక్టర్ అని చిన్న భయం ఉండేది. కానీ సెట్లో ఆమె ఎనర్జీ చూసి ఫ్యాన్ అయి పోయాను. చాలా పాజిటివ్‌గా ఉంటారు. కేరళలో షూటింగ్ అప్పుడు మేం ఫ్రెండ్స్ అయి పోయాం. రెండు రోజులు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఫోన్ చేసి కూడా విసిగిస్తున్నా. త్వరలోనే మేమిద్దరం కలసి ఓ సినిమా చేస్తాం అన్నారు రష్మిక. వచ్చే నెలలో భీష్మ విడుదల అవుతుంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో హీరోయిన్‌గా చేయ బోతున్నాను. రెండు మూడు నెల్లలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. మిగతావి చర్చల్లో ఉన్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి