నేను గర్భవతి కానున్న పదుకొనే
బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే మీడియాపై ఫైర్ అయ్యారు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి మండిపడటంతో అంతా అవాక్కయ్యారు. నేను గర్భవతిలా కనిపిస్తున్నానా అంటూ బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చపాక్ సినిమా ప్రమోషన్లలో దీపిక బిజీగా ఉన్నారు. పలు రియాలిటీ షోలు, కార్యక్రమాలకు హాజరవుతూ అభిమానులతో సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా చపాక్‌తో పాటు తన తదుపరి సినిమాల గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఓ కార్యక్రమంలో దీపిక మాట్లాడుతూ..షకున్ బాత్రా దర్శకత్వంలో తెర కెక్కనున్న సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండేతో కలిసి నటిస్తున్నాను.
ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం అవుతుంది. ఇంకా టైటిల్ నిర్ణయించ లేదు. అయితే 2021, ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని పేర్కొన్నారు. ఇక బిగ్‌బాస్ షోలో చపాక్‌ను ప్రమోట్ చేస్తారా అని అడుగగా..ఇందుకు సంబంధించి నిర్వాహకులతో ఎలాంటి చర్చ జరగ లేదన్నారు. ఈ విధంగా దీపిక తన మూవీ బిజీ షెడ్యూల్ గురించి ఓపికగా వివరిస్తుండగా..మీరు గర్భవతట కదా అంటూ ఒకరు అడిగారు. ఇందుకు బదులుగా...ఏంటీ నేను ప్రెగ్నెంట్‌లా కనిపిస్తున్నానా, నేనెప్పుడు తల్లిని కావాలో మీరే చెప్పండి. మీరు అనుమతి ఇస్తేనే మేం పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటాం.
ఒకవేళ నిజంగా గర్భవతిని అయితే దాచాల్సింది ఏముంటుంది. అందరికీ కనపడుతుంది కదా అని కౌంటర్ ఇచ్చారు. కాగా గతేడాది రణ్‌వీర్ సింగ్‌తో దీపిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తల్లి కాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా బీ టౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిని ఖండించిన దీపిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించి, నిర్మాతగా వ్యవహరించిన చపాక్ సినిమా విడుదల కానుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి