ఓలాకు హ్యూందాయి ఎలక్ట్రికల్ కార్లు
సౌత్ కొరియా ఆటోమేకర్ హ్యూందాయి మోటార్స్ కంపెనీ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఏసియాలో కార్ల అమ్మకాలలో టాప్ 2 పొజిషన్‌లో ఉన్న ఈ కంపెనీ సరికొత్తగా ఆలోచిస్తోంది. ఇతర సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉండేలా ఒప్పందాలు చేసుకుంటోంది. ఇండియాలో ఇప్పిటకే ఓలా అద్దెకు వాహనాలను సమకూర్చి పెడుతోంది. 2021 వరకు దక్షిణ కొరియా కార్ల కంపెనీ యాజమాన్యం ఓలాతో ఒప్పందం చేసుకుంది. సంతకాలు కూడా జరిగి పోయాయి. విద్యుత్ సామర్థ్యంతో నడిచేలా ఎలక్ట్రికల్ హ్యూందాయి కార్లను ఓలాకు సరఫరా చేసేందుకు ఇప్పటి నుంచే తయారీలో నిమగ్నమైంది.
స్మార్ట్ ఈవి ప్లాట్ ఫాం పద్ధతిన ఈ వెహికిల్స్ ఇండియాకు రానున్నాయి. ఓలాకు చేరుకోనున్నాయి. హ్యూందాయి కంపెనీకి సహ కంపెనీగా కియా మోటార్స్ లిమిటెడ్ సంస్థ ఉంది. తాజాగా కియా కంపెనీ ఓలా కంపెనీలో 300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. విద్యుత్ వాహనాలతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కూడా అందజేయనుంది. దీని వల్ల గ్లోబల్ మార్కెట్‌లో తన వాటా పెంచుకోవాలనే వ్యూహంతో హ్యూందాయి ఈ డిసిషన్ తీసుకుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్మార్ట్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా ఉంటోంది. ఇదిలా వుండగా 2020 సంవత్సరానికి గాను 1 మిలియన్ విద్యుత్ వాహనాలు కావాల్సి వస్తుందని ఓలా యాజమాన్యం స్పష్టం చేసింది. భారీగా పెట్టుబడులు అవసరమవుతాయి.
త్రీవీలర్స్ తో పాటు ఫోర్ వీలర్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తోంది ఓలా. వీటికే అత్యధిక డిమాండ్ ఉంటోంది. కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ వెహికిల్స్ ఫెయిల్ కావడంతో డ్రైవర్లు పెట్రోల్ , డీజిల్ కార్లను వినియోగిస్తున్నారు. దీంతో ఇటీవల కొంచెం స్తబ్దత ఏర్పడింది. 2021లో విద్యుత్ వాహనాలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది ఓలా కంపెనీ. ఓలాతో పాటు ఊబర్ పోటీ పడుతోంది. మరో వైపు ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలు భవిష్యత్ రెంట్ క్యాబ్స్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపిస్తున్నాయి. ఈ వెహికిల్స్ 20 నుంచి 25 లక్షలు ఉండబోతున్నాయి. 230 నుంచి 250 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం ఉండేలా తయారు చేస్తోంది హ్యూందాయి. ఏది ఏమైనా కొత్త ఆలోచన ఇవాళ మరింత పెట్టుబడులు వచ్చేలా చేస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి