ఊసూరుమనిపించిన చంద్రయాన్ -2 ..శివన్ ను ఓదార్చిన మోదీ..!
దేశం యావత్తు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూసిన సమయంలో చంద్రయాన్ -2 జాబిలమ్మ దగ్గరకు వెళ్ళినట్లే వెళ్లి ఆచూకీ లేకుండా పోయింది. ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పై కోట్లాది మంది ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. అనుకోని రీతిలో అది ఆగి పోయింది. దీంతో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఈ సమయంలో ఎంతో కష్టపడినా ఫలితం దక్కక పోవడంతో ఇస్రో చైర్మన్ శివన్ కంటతడి పెట్టారు. ఆయనను ప్రధానమంత్రి మోదీ ఓదార్చారు. మీ శ్రమలో ఎలాంటి లోపం లేదు. రాబోయే రోజుల్లో మీరు మరెన్నో విజయాలు సాధించగలరు. మీ కృషి అపారం. అమోఘం.
ఇవ్వాళ కాకపోయినా రేపైనా అంతిమ గెలుపు మీదేనని పీఎం శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. ఇక జాబిల్లి కొద్ది దూరంలో ఉన్న సమయంలో చంద్రయాన్ -2 వచ్చి ..చిక్కకుండా ఆగి పోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇలా జరిగిందని చైర్మన్ శివన్ వెల్లడించారు. దీనిని ప్రయోగం చేసినప్పటి నుంచి ప్రతి నిమిషం కీలకమేనని ఆయన పేర్కొంటూ వచ్చారు. ఇదే సమయంలో సాంకేతిక లోపం చోటు చేసుకోవడం వల్లనే ఇలా జరిగిందంటూ తెలిపారు. దాదాపు 90 శాతహానికి పైగా సక్సెస్ ఫుల్ గా జాబిల్లమ వద్దకు చంద్రయాన్ -2 చేరుకున్నది. అక్కడ తేమ, నీళ్లు ఉన్న విషయాలను చిత్రాల ద్వారా పంపించింది. దీంతో ఈ సుదీర్ఘమైన ప్రయత్నం ఫలించినట్టే. కాకపోతే వందలాది మంది సిబ్బంది, శాస్త్రవేత్తలు పెద్దఎత్తున కష్టపడ్డారు. అగ్ర రాజ్యాలతో పోటీ పడ్డారు.
ముందు నుంచీ చెబుతూ వస్తున్నట్టు 15 నిముషాలు కీలకం. ఇదే క్రమంలో 14 నిముషాలు సాఫీగానే జరిగాయి. కానీ ఆఖరు నిమిషం వచ్చే సరికల్లా కనెక్ట్ పూర్తిగా తెగి పోయింది. దీంతో ఒక్కసారిగా శివన్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. దేశం పట్ల, వృత్తి పట్ల ఉన్న అంకిత భావం ఇలా చేస్తుందని అనుకోవాలి. చాలా కస్టపడి చైర్మన్ స్థాయికి చేరుకున్న ఈ తమిళనాడు శాస్త్రవేత్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రయోగం విఫలం కావడంతో దేశమంతటా ఇస్రో పట్ల అభిమానం మరింత పెరిగింది. ఎక్కడా శాస్త్రవేత్తల తప్పు లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అన్నిటికంటే భారత ప్రధాని మోడీ శివన్ ను ఓదార్చడం జాతి మొత్తాన్ని కలచి వేసింది. నిబద్దత కలిగిన మీ ప్రయత్నం ఎన్నడూ విఫలం కాదు. ఆ నమ్మకం నాకున్నది. బాధ పడకండి. ధైర్యాన్ని కోల్పోకండి. ఇంకా కొత్తగా మరో ప్రయత్నం మొదలు పెట్టండి. మీ వెంటే నేనుంటానని భరోసా కల్పించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి