సెక్యూరిటీకే ప్రయారిటీ..రానున్న జియో గేట్
ధీరుభాయి అంబానీ స్థాపించిన రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా చేజిక్కించుకునే స్థాయికి అత్యంత దగ్గరలో ఉన్నది. ప్రత్యర్థి కంపెనీలను తలదన్నేలా వినూత్న పంథాను అవలంభిస్తూనే, తన బ్రాండ్ తో పాటు ఇమేజ్ ను పెంచుకుంటూ పోతోంది. బిజినెస్ లో గెలుపు ఓటముల గురించి చర్చ అనవసరం. ట్రెండ్ ను గుర్తించడం. భిన్నంగా ఆలోచించడం. పక్కా ప్లాన్ రూపొందించడం. ఆచరణలో అందరికంటే ముందు ఉండేలా ప్రయత్నం చేయడం. ఇదే మేము అనుసరిస్తున్న పద్ధతి. ఇంతకంటే మేము ఎలాంటి మ్యాజిక్కులు చేయడం లేదంటూ ఇటీవల ముంబై లో జరిగిన రిలయన్స్ కంపెనీల సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు, చైర్మన్ హోదాలో ఉన్న ముకేశ్ అంబానీ.
దేశంలో మీరు ఎక్కడికి వెళ్లినా జియో కంపెనీ లోగో ఉండాల్సిందే. అందుకే ప్రతి భారతీయుడి కుటుంబం ఇందులో లీనం కావాలన్న సుదీర్ఘమైన కలల్ని మా తండ్రి ధీరుభాయి కన్నారు. దానిని మేము ఇవ్వాళ దిగ్గజ కంపెనీలను దాటుకుని అందజేయగలిగాం. ఇది నా ఒక్కరితో అయ్యిందనుకుంటే పొరపాటే, నాతో పాటు సంస్థను నమ్ముకున్న లక్షలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, సలహాదారులు, మేధావులు, ఇంజనీర్ల శ్రమ దాగి ఉన్నది. ఇప్పుడు మేము తల ఎత్తుకుని చెబుతున్నాం. ఇండియా అంటే రిలయన్స్. రిలయన్స్ అంటే భారత్ ..అన్న స్థాయిలోకి వచ్చాము.
ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాము. టెలికాం రంగంలో ఇదో అతిపెద్ద సంచలనం. ప్రతి సామాన్యుడు మాతో కనెక్ట్ కావాలన్నదే మా ఆలోచన. ఇప్పటి దాకా కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమై పోయాం. ఇక నుంచి మా అపరిమితమైన నెట్ వర్క్ , వేలాది మంది సభ్యుల సేవలను మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని ముకేశ్ తెలిపారు. త్వరలో ఈ కామర్స్, డిజిటల్ టెక్నాలజీ తో పాటు సెక్యూరిటీ రంగంలోకి ఎంటర్ అవుతున్నామని వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న కంపెనీలకు ఝలక్ ఇచ్చింది రిలయన్స్ కంపెనీ. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి