కాదలే..కాదలే..వైరలే..!

ఈ ప్రపంచాన్ని ఆవిష్కరించే కాన్వాస్ సినిమా. అనంతమైన బతుకును..సమాజాన్ని శాసించే కాలాన్ని ఒడిసి పట్టుకునే ఆయుధమే మూవీ. అదో అంతులేని ప్రవాహం. అంతమే లేని ప్రపంచం. ప్రతి సినిమా గొప్పగా ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. కానీ అలా ఉండాలని తీసేందుకు లక్షలాది మంది ఫిల్మ్ మేకర్స్ రేయింబవళ్లు పడరాని పాట్లు పడుతున్నారు. శక్తికి మించి, బతుక్కి మించి కష్టపడుతున్నారు. ఒక్కో సినిమా ఒక్కో లోకం. ప్రతి మూవీ ఆడొచ్చు..ఆడక పోవొచ్చు. కానీ పది కాలాల పాటు గుర్తుంచుకునే సినిమాలు కోకొల్లలు. ప్రతి దృశ్యం ఆకట్టు కోవాలన్నా, గుండెల్లో గూడు కట్టు కోవాలన్నా దమ్ముండాలి.

దానికి తెర మీద ప్రాణం పోయాలంటే క్రియేటివిటీ కలిగిన డైరెక్టర్ కష్టపడాలి. అలాంటి వాళ్ళు వేళ్ళ మీద ఉన్నారు. మాటలు, సీన్స్ , పాత్రలు, పాత్రధారులు, విలన్స్, హీరో హీరోయిన్లు అన్నీ ఉన్నా డామినేట్ చేసేది మాత్రం . సంగీత నేపధ్యం. అందుకే అంతటి ప్రాధాన్యత. వేలాది పాటలు ప్రాణం పోసుకుంటున్నాయి. గూగుల్ పుణ్యమా అంటూ యూట్యూబ్ లో లక్షలాదిగా కావాల్సిన పాటలన్నీ, కోల్పోయిన వన్నీ తిరిగి లభిస్తున్నాయి. ఒకందుకు దానికి రుణపడి ఉండాలి మనమంతా. గాయని గాయకుల్లో ఎందరో తమ గాత్రంతో సినీ పరిశ్రమకు ప్రాణం పోశారు. ఇంకా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. క్రియేటివిటీ కలిగిన గాయనీ గాయకులూ వేలాది మంది యూట్యూబ్ వేదికగా, తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుని విజేతలుగా నిలుస్తున్నారు.

ఇదే క్రమంలో కొన్ని పాటలు వైరల్ అవుతున్నాయి. క్షణాల్లో ట్రెండ్ సృష్టిస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. తాజాగా చిన్మయి శ్రీపాద, గోవింద వసంత పాడిన కాదలే..కాదలే..వైరలే...అంటూ పాడిన సాంగ్ యూట్యూబ్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. నటి త్రిష నటించగా తీసిన 96 సినిమా ఈ ఒక్క సాంగ్ తో పాపులర్ అయి పోయింది. సో..గోవింద్ చేసిన మ్యూజిక్ దేశాన్ని ఊపేస్తోంది. ఎక్కడ విన్నా రింగ్ టోన్స్ లలో చిన్మయి వాయిస్ మార్దవంగా తడుముతోంది. అవును కదూ ...కాదలే..కాదలే...అంటూ పాడుకోవడమే మిగిలింది. వీలైతే వినండి ..మీరూ అభిమానిగా మారి పోతారు. చిన్మయి గాత్రపు ప్రవాహంలో కొట్టుకుపోతారు..మైమరచి పోతారు. అవును కాదలే..కాదలే..వైరలే..మనసు ఉప్పొంగెలే ..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!