రికార్డుల మోత మోగిస్తున్న సాహూ - డార్లింగ్ ప్రభాస్ హవా
తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చినట్లున్నాయి. గత ఏడాదితో పాటు ఈ సంవత్సరం విడుదలైన సినిమాలు పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుని ముందుకు వెళుతుండడం ఓ రకంగా శుభ పరిణామమనే చెప్పాలి. ఒకప్పుడు 20 కోట్లు అంటే అతి పెద్ద బడ్జెట్ అనుకునే వాళ్ళం. కానీ రాజమౌళి ఏ ముహూర్తాన బాహుబలి మూవీ తీశాడో, ఇక అప్పటి నుంచి తెలుగు సినిమాకు హాలీవుడ్ స్థాయిలో ఓ రేంజ్ వచ్చేలా చేసింది. ఆ తర్వాత ఇతర హీరోలు నటించిన సినిమాలు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ ఒక్క సినిమాతో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు.
బాహుబలి అతడికి ఎనలేని స్టార్ డం తీసుకు వచ్చేలా చేసింది. దాని తర్వాత ఏ సినిమా చేస్తాడోనని అభిమానులు ఉత్కంఠకు లోనయ్యారు. దానిని పటాపంచలు చేస్తూ ప్రభాస్ టాలీవుడ్ లో కేవలం ఒకే ఒక్క సినిమా రన్ రాజా రన్ మూవీ మాత్రమే తీసిన అనంతపురం జిల్లాకు చెందిన సుజీత్ రెడ్డి కి అవకాశం ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి అనుభవం లేని డైరెక్టర్ కు సినిమా చేసేందుకు సంతకం చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కానీ ప్రభాస్ అతడిపై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఏకంగా ఇండియన్ సినిమా మొత్తం విస్తు పోయేలా హయ్యెస్ట్ బడ్జెట్ తో సాహూ సినిమా తీశాడు. బాహుబలి విడుదల అయ్యాక రెండేళ్ల తర్వాత తీసిన సినిమా ఇది. భారీ ఎత్తున హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా అత్యంత రిచ్ గా మూవీ ని తీశాడు సుజీత్ రెడ్డి.
బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించగా మిగతా భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. విడుదలకు ముందు సినిమా ప్రమోషన్ మొత్తం డార్లింగ్ ప్రభాస్ చూసుకున్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ భారీ ఎత్తున చేశారు. ఈ ఈవెంట్ కు దాదాపు లక్షకు పైగా అభిమానులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 10 వేలకు పైగా థియేటర్లలో సాహూ ను రిలీజ్ చేశారు. కేవలం 5 రోజుల్లో 350 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది ఈ మూవీ. ఓవర్ సీస్ లో హాలీవుడ్ సినిమాలను కాదని ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది.
ఇప్పటికే భారత్‌లో మరో నటుడికి సాధ్యం కానీ స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ప్రభాస్, సాహోతో వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.తొలి వారాంతంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో సాహో రెండో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ మూవీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ : హాబ్స్ అండ్ షా’ ఒక్కటే సాహో కన్నా ముందు ఉన్నాయి లయన్ కింగ్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, ఏంజల్ హ్యాస్ ఫాలెన్ లాంటి సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలు కూడా సాహో తరువాతి స్థానాలతో సరిపెట్టుకోవటం విశేషం. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి. ఎంతైనా ఏ క్రెడిట్ అంతా సుజీత్ రెడ్డిదేనని చెప్పక తప్పదు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి