దేశానికే ఆదర్శం..రవీందర్ సింగ్ నిర్ణయం
కోట్లు వుంటే ఏం లాభం..కొలువులుంటే ఏం ప్రయోజనం..పదవులుంటే ఏం చేసుకుంటాం. మనమైతే కోట్లు ఎలా కొల్లగొట్టాలో ఆలోచిస్తాం. ఎవరి మీద పడితే డబ్బులు వస్తాయో ప్లాన్లలో మునిగి తేలుతాం. కానీ అధికార పార్టీకి చెందిన రవీందర్ సింగ్ మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. ఏ మతమైనా..ఏ కులమైనా సరే ఆదుకోవడం ఆయనకు అలవాటు. ఇంకేం ఏకంగా పార్టీని నమ్ముకున్నందుకు నగర పాలక సంస్థకు మేయర్‌గా ఎన్నుకోబడ్డారు సింగ్. అందరూ గెలిచాక ప్రజలను పట్టించు కోవడం మానేస్తే..రవీందర్ సింగ్ మాత్రం జనం కోసం ఏమేం చేస్తే బాగుంటుందోనని నిత్యం ప్రజా సేవకు అంకితమయ్యారు. రోడ్డు మీద రూపాయి పడితే వదిలి వేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే ఆ రూపాయితో ఏం వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
కానీ మనోడు మాత్రం ఆ రూపాయికి మరింత విలువను పెంచారు. సేవ చేయాలన్న తలంపు వుంటే ..మానవత్వం వెల్లి విరియదా..నగర వాసులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించండి..మధ్య దళారులను ఆశ్రయించకండి..మీ వెనుక నేనున్నా..మీకు క్షణాల్లో నల్లా కనెక్షన్ ఇస్తామంటూ ప్రకటించారు. దెబ్బకు ఆయన ఇలా ప్రకటించారో లేదో ప్రజలు ఆ పథకానికి ఫిదా అయ్యారు. సింగ్ మావోడంటూ కితాబిచ్చారు. తాజాగా దేశంలో ఎవరూ చేయలేని పనిని రవీందర్ సింగ్ చేశారు. అదేమిటంటే ..కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే కుల, మతాలకు అతీతంగా దహన సంస్కారాలు నిర్వహిస్తామని, 50 మందికి 5 రూపాయల చొప్పున భోజనం కూడా పెడతామని ప్రకటించారు.
దెబ్బకు దేశమంతా సింగ్ వైపు చూసింది. ఉన్నతాధికారులు, పొలిటికల్ లీడర్లు, కంపెనీల పెద్దలు, బిజినెస్ మెన్స్ ..ఇలా ప్రతి ఒక్కరు కరీంనగర్ మేయర్ చేసిన పనిని పొగుడుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తారు. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా సింగ్‌ను అభినందించారు. ఇలాంటి ఆలోచన రావడం నిజంగా అభినందనీయమన్నారు. జీవితం ధన్యమైనట్టేనని ట్వీట్ చేశారు. మరో వైపు కేటీఆర్ రవీందర్ సింగ్ ను ఆకాశానికెత్తేశారు. సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని, ఇదే పథకాన్ని తెలంగాణ అంతటా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తమ పార్టీకి చెందిన శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, నేతలు, ప్రజా ప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. చాలా మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. వారి పరిస్థితులను గమనించిన సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. దాతల ద్వారా, ఇతరుల ద్వారా నిధులు సేకరించి దహన సంస్కారాలను నిర్వహిస్తామని తెలిపారు. ఇదంతా నగర పాలక సంస్థ చూసుకుంటుందన్నారు. ఇందు కోసం నిధులు కేటాయించడంతో పాటు ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
అంతిమ యాత్ర..ఆఖరి సఫర్ ..పేరు పెట్టారు. విషయం తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంటనే ట్విట్ చేశారు. వచ్చే నెల 15 లోగా పూర్తి కార్యాచరణతో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర పాలక సంస్థ ద్వారా ఇప్పటికే కోటి 10 లక్షల రూపాయలు కేటాయించామని, మరో 50 లక్షలతో వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపామన్నారు సింగ్. దాతల కోసం ప్రత్యేకంగా నగర పాలక కమిషనర్ పేరు మీద ఖాతా ఏర్పాటు చేస్తామన్నారు. దేశానికి ఇలా ఆలోచించే వాళ్లు కావాలి. ఆచరణాత్మకంగా ఉండే పాలకులు ఉంటే జనానికి మేలు చేసిన వారవుతారు. సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది భారతీయులను కదిలిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి