న బూతో న భ‌విష్య‌త్ - అశ్లీలం స‌ర్వ నాశ‌నం

నాలుగు గ‌దుల్లో దాచు కోవాల్సినవ‌న్నీ ఇపుడు బ‌హిర్గ‌త‌మై పోతున్నాయి. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ మంచి కంటే చెడు ఎక్కువ‌గా ముక్కు ప‌చ్చ‌లార‌ని యువ‌తీ యువ‌కుల‌ను టార్గెట్ చేస్తోంది. భోజ‌నం లేకుండా ఉండ‌గ‌ల‌రమో కానీ మొబైల్స్ లేకుండా ఉండ‌లేని స్థితికి వ‌చ్చేశారు. కాదంటే బాధ‌..వ‌ద్దంటే కోపం..క‌న్న‌వారి మీద క‌సురు కోవ‌డాలు..కుటుంబం అంటే గౌర‌వం లేదు. పాఠాలు చెప్పే వారి ప‌ట్ల కృత‌జ్ఞ‌త లేదు. బ‌ట్టీ ప‌ట్ట‌డాలు..ర్యాంకుల మోత‌లు..ఇలా చెప్పుకుంటూ పోతే దిగ్భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వాలు వెలుగు చూశాయి. చెప్పుకోవాలంటే సిగ్గు చేటు. 60 ఏళ్లకే రావాల్సిన అనుభవం ఇపుడు 10 ఏళ్ల పిల్ల‌ల‌కు అర్థ‌మై పోతోంది.

ఇదేమిటంటే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయిగా..పేరెంట్స్ త‌మ బాధ్య‌త‌ల‌ను విస్మ‌రిస్తున్నారు. నూటికి 90 శాతం పిల్ల‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం లేదు. గాలికి వ‌దిలి వేస్తున్నారు. పాఠాలు బోధించాల్సిన వాళ్లు సైతం ప్రేమ పాఠాలు వ‌ల్లె వేస్తున్నారు. బంధాల‌కు అర్థం లేకుండా పోయింది. డాల‌ర్ల మాయ‌లో ప‌డిన వీరంతా దేశాన్ని ఏం ర‌క్షిస్తారో తెలియ‌డం లేదు. సామాజిక మాధ్యమాల్లో ..గూగుల్ వ‌చ్చాక‌..రిల‌య‌న్స్ జియో ఎంట‌ర్ అయ్యాక‌..కోట్లాది కుటుంబాల్లో ప్రైవ‌సీ అంటూ లేకుండా పోయింది. ఎవ‌రు ఏం చేస్తున్నారో ..ఏం చూస్తున్నారో తెలియ‌డం లేదు. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా ..జ‌రిగే దారుణాలు జ‌రుగుతూనే ఉన్నాయి. కుటుంబ స‌మేతంగా క‌లిసి చూసే సినిమాలు వ‌చ్చి ఛాన్నాళ్ల‌యింది.

బ‌స్సులో ముద్దు పెట్టేసి..కార్యం గురించి షాపింగ్ మాల్‌లో న‌టీ న‌టుల మ‌ధ్య డైలాగ్స్ రాసిన డైరెక్ట‌ర్ కు ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురుస్తున్నాయి. అంత‌గా ఎదిగి పోయామా లేక మ‌న‌ల్ని మ‌నం త‌గ్గించుకుంటున్నామా. ఎథిక్స్ లేవు. విలువ‌లు అస‌లే లేవు. ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క త‌ల్లిదండ్రులు నానా తంటాలు ప‌డుతున్నారు. లెక్క‌లేన‌న్ని కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాట‌య్యాయి. కౌమార ద‌శ‌లో కంట్రోల్ చేసుకోవాల్సిన యువ‌త బూతును చూడటంలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ప్రేమో..ఏది మంచో ..ఏది చెడో తెలియ చేయాల్సిన పేరెంట్స్ ..వారు కూడా అందులోనే కూరుకు పోయారు.

సామాజిక మాధ్య‌మాల‌న్నీ అశ్లీల వీడియోలు, క‌థ‌లు, ఫోటోల‌తో నిండి పోతున్నాయి. జ‌స్ట్ క్లిక్ చేస్తే చాలు ..అంద‌మైన భామ‌లు..వ‌య్యారాలు వ‌ల‌క బోస్తూ ..బ‌ట్ట‌లు విప్పేస్తూ..ప‌రువును బ‌జారులో పెడుతున్నారు. ఎన్ని చ‌ట్టాలు చేస్తే లాభం..ఒక‌ప్పుడు బూతు నాలుగు గోడ‌ల మ‌ధ్య‌నే ఉండేది..ఇపుడు మార్కెట్‌ను శాసిస్తోంది. సెక్స్ వ్యాపారం 10 వేల కోట్ల డాల‌ర్ల‌ను దాటేసింది.
ఆద‌ర్శంగా ఉండాల్సిన వారు ప‌క్క‌దారి ప‌డుతుంటే ..ఇంక పిల్ల‌ల‌కు ఏం నేర్ప‌గ‌ల‌రు. త‌లొంచు కోవ‌డం త‌ప్ప‌. ఫోన్ల‌లో గ‌డప‌డం..ఛాటింగ్ చేయ‌డం..ఛీటింగ్‌కు పాల్ప‌డటం..ఏమ‌న్నా అంటే క‌సురు కోవ‌డం, ఈవ్ టీజింగ్‌కు పాల్ప‌డ‌టం, లేదంటే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం ఇదే నేటి యువ‌త చేస్తున్న‌ది.

ఎందుకు క‌న్నామా అనే బాధ‌కు లోన‌వుతున్నారు చాలా మంది పేరెంట్స్. అంత‌ర్జాలం అశ్లీలానికి గాలం వేస్తోంది. వీటిని ఈవ్ టీజ‌ర్లుగా మారుతున్నారు. అందుకే లెక్క‌లేన‌న్ని కేసులు పోలీసు ఠాణాల్లో న‌మోద‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌... వాట్సాప్‌... యూట్యూబ్‌... తదితర సామాజిక మాధ్యమాలతో ఎన్నో ఉపయోగాలున్నా... కౌమార దశలో ఉన్న విద్యార్థులు 65 శాతం మంది వీటిలో అశ్లీల దృశ్యాలు.. సమాచారం వైపే మొగ్గుచూపుతున్నారు.. అంతర్జాల కేంద్రాలు... ల్యాప్‌ట్యాప్‌లలో వీటిని చూస్తే ఎవరైనా గమనిస్తారన్న భావనతో స్మార్ట్‌ ఫోన్లలో వీక్షిస్తున్నారు. వీటి ప్రభావంతోనే యువతులు, సహ విద్యార్థినులను ..వేధిస్తున్నారు.

కొందరు పార్టీల పేరుతో అసభ్య చిత్రాలను చూస్తున్నారు.. ఈ వాస్త‌వాల‌న్నీ షి బృందం సేక‌రించిన స‌మాచారంలో వెలువ‌డింది. 63 శాతం మంది యువ‌త వాటినే చూస్తున్నార‌ని తేలింది. ఇప్ప‌టికైనా పేరెంట్స్ త‌మ పిల్ల‌ల‌కు స్మార్ట్ ఫోన్ల‌ను ఇచ్చినప్పుడు కుటుంబంలో ఎవ‌రో ఒక‌రు త‌ప్ప‌క ప‌క్క‌న ఉండాలి. లేదంటే లేని ప్ర‌మాదం కొని తెచ్చుకున్న‌ట్ల‌వుతుంది. చూసే కొద్ది చూడాల‌నిపించేలా..మాన‌సికంగా దౌర్భ‌ల్యానికి గురి చేస్తూ..దేని మీదా శ్ర‌ద్ధ పెట్ట‌లేని స్థితిలోకి చేరుకుని..ప‌క్క‌దారి ప‌ట్టేలా చేసే వీటి ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి. లేక పోతే భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌వుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!