గ్రోఫర్సా ..మజాకా - ఎస్‌బీ బిగ్ ఆఫర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అంటూ కనెక్టివిటీ ఈజీగా మారి పోయింది. ఒకప్పుడు టెలికాం, రవాణా రంగాలు జనానికి దూరంగా ఉండేవి. ఎప్పుడైతే అవి రావడం ప్రారంభమైందో ప్రపంచం చిన్నదై పోయింది. ఐటీ అంటేనే ఇండియా.అంతగా పాపులర్ అయ్యిందీ ఈ దేశం. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సెక్టార్‌లో అమెరికా టాప్ వన్ పొజిషన్‌లో వుంటే..అందులో 30 శాతానికి పైగా భారతీయులే ఉన్నత స్థానాల్లో కొలువుతీరారు. అదే స్ఫూర్తితో గూగుల్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, ఇన్ఫోసిస్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, స్నాప్ ఛాట్, ఇలా ప్రతి సామాజిక మాధ్యమాలను నిర్వహిస్తున్న వారిలో ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్సే ఉన్నారు. వీరే ప్రతి ఫార్మాట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
దీనిని స్ఫూర్తిగా తీసుకున్న నేటి యువత కొత్తగా ఆలోచిస్తోంది. డిఫరెంట్ గా ఉండేందుకు యత్నిస్తోంది. వారు త్వరగా తమ కాళ్ల మీద నిలబడాలని కోరుకుంటున్నారు. సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే తాము ఒకరి కింద పని చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఐడియాసుకు పదును పెడుతూ ..స్టార్టప్ లకు ప్రాణం పోస్తున్నారు. గతంలో పెట్టుబడి కోసం భయపడి కొత్త వాటిని స్టార్ట్ చేసేందుకు జంకేవారు..ఇపుడు ఆ బెంగ తీరిపోయింది. లెక్కలేనంత మంది ఇన్వెస్టర్స్, ఆంట్రప్రెన్యూర్స్, స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ..ఏకంగా స్టార్టప్స్ కోసం ప్రత్యేకంగా ఫండింగ్ ఏర్పాటు చేశాయి.
న్యూ వేవ్‌తో ఆన్ లైన్ ఫార్మాట్‌లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభించిన గ్రోఫోర్స్ కంపెనీ అదృష్టం పండింది. బడా దిగ్గజ కంపెనీలు ఈ స్టార్టప్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయి. జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్, టైగర్ గ్లోబల్ డెలివర్ 220 మిలియన్ డాలర్లను గ్రోఫెర్స్‌లో పెట్టుబడి పెట్టాయి. సప్లయి ఛైన్ ఆపరేషన్స్ బేస్ గా ఇది కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సౌత్ కొరియన్ ఇన్వెస్ట్ మెంట్ ఫర్మ్ కెటిబి వెంఛర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ , టైగర్ గ్లోబల్ , సెక్వోరియా కేపిటల్ ఇందులో పార్టిసిపేట్ చేశాయి. ఇంత భారీ మొత్తంలో గ్రోఫెర్స్ కు ఆఫర్ రావడం ఊహించని పరిణామం. ముఖ్యంగా గ్రోఫెర్స్‌కు మరో కంపెనీ బిగ్ బాస్కెట్ నుంచి పోటీ నెలకొంది.
ఈ ఫండింగ్ సపోర్ట్‌తో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు, ఆపరేషన్స్ మరింత వేగవంతం చేసేందుకు వీలు కలుగుతుంది. వరల్డ్ లో ఈ కామర్స్ రంగంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న చైనా కంపెనీ అలీబాబా .బిగ్ బాస్కెట్ పై కన్నేసింది. 150 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఆన్ లైన్ సెక్టార్ లో ఈ రెండు కంపెనీలు పోటా పోటీగా కొనసాగుతున్నాయి. మరో వైపు ఈ కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలు కూడా సై అంటుండడంతో పోటీ తీవ్రం కానుంది. వ్యాపారం అన్నాక పోటీ తప్పకుండా ఉంటుంది. మనం ఇచ్చే సర్వీస్ మీదే మన ఆదాయం, విజయం ఆధారపడి ఉంటుందంటున్నారు ..గ్రోఫెర్స్ సిఇఓ థింసా. ఏది ఏమైనా జాక్ పాట్ కొట్టేసిన థింసాను అభినందించాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి