ఇండియ‌న్ టెలికాం సెక్టార్‌లో జియోనే టాప్

భార‌త దేశంలోని టెలికాం రంగంలో రిల‌య‌న్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన జియో రిల‌య‌న్స్ కంపెనీ టెలికాం ఆప‌రేట‌ర్ల‌ను తోసిరాజ‌ని నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకుని చ‌రిత్ర సృష్టించింది. ముఖేష్ అంబానీకి చెందిన 4జీ సేవ‌ల కంపెనీ రిల‌య‌న్స్ జియో..ఇండియాలో అతి పెద్ద టెలికాం కంపెనీగా అవ‌త‌రించింది. గ‌త నెల చివ‌రి నాటికి స‌ద‌రు కంపెనీ వినియోగ‌దారుల సంఖ్య ఏకంగా 33 కోట్ల 13 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇప్ప‌టి దాకా టాప్ రేంజ్‌లో కొన‌సాగుతూ వ‌చ్చిన వొడాఫోన్, ఐడియా క‌స్ట‌మ‌ర్లు 32 కోట్ల‌కు త‌గ్గారు. దీంతో జియో టాప్ రేంజ్‌లోకి చేరుకుంది. ప్ర‌తి రోజూ కొత్త క‌ష్ట‌మ‌ర్ల‌తో పాటు ఇత‌ర టెలికాం ఆప‌రేట‌ర్ల నుంచి వినియోగ‌దారులు జియో కంపెనీని ఎంచుకుంటున్నారు. 4జీ సేవ‌ల్లో భాగంగా డేటా, వీడియో కాల్స్, అప‌రిమిత‌మైన సేవ‌లు అందించ‌డం, దేశ వ్యాప్తంగా విస్తృత‌మైన నెట్ వ‌ర్క్ క‌లిగి ఉండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు జియోను ఎంపిక చేసుకుంటున్నారు. 

మొద‌ట్లో లైట్‌గా తీసుకున్న ఇత‌ర టెలికాం కంపెనీలు ఇపుడు చింతిస్తున్నాయి. ఎటూ పాలుపోక ప‌క్క చూపులు చూస్తున్నాయి. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటూ వ‌చ్చిన ట్యాగ్ లైన్ ..ఐడియా కంపెనీది. ఇంకేం జ‌నం కోట్ల‌ల్లో దాని వైపు మ‌ళ్లారు. ఆ త‌ర్వాత ఎయిర్ టెల్ దుమ్ము రేపింది. డేటా, కాలింగ్ సౌక‌ర్యాన్ని క‌ల్పించింది. వోడాఫోన్ ఎంట‌ర్ అయ్యాక‌..టెలికాం రంగం స్వ‌రూప‌మే మారి పోయింది. ఆయిల్ రంగంలోకి అడుగిడిన రిల‌య‌న్స్ ..ముంబ‌యి కేంద్రంగా జియోను ప్రారంభించింది. దెబ్బ‌కు మిగ‌తా కంపెనీలను కోలుకోలేకుండా చేసింది. గ‌త మే నెల‌లో ఎయిర్‌టెల్ కంపెనీని వెన‌క్కి నెట్టి రెండో స్థానాన్ని చేరుకున్న జియో..ఆ త‌ర్వాతి నెల‌లో నెంబ‌ర్ 1 పొజిష‌న్ కు చేరుకుంది. టెలికాం రంగ నియంత్ర‌ణ మండ‌లి ( ట్రాయ్ ) డేటా ప్ర‌కారం ..మే నెల‌లో జియో కంపెనీకి 32. 29 కోట్ల‌తో 27.80 శాతం మార్కెట్ వాటాతో దేశంలో రెండో అతి పెద్ద టెలికాం కంపెనీగా నిలిచింది. 

ఇక 32.30 కోట్ల యూజ‌ర్ల‌తో 27.6 శాతం మార్కెట్ వాటాతో ఎయిర్ టెల్ మూడో స్థానానికి జారుకుంది. మే నెల‌లో జియో నెట్ వ‌ర్క్‌లోకి 81 లక్ష‌ల 80 వేల మంది కొత్త‌గా వినియోగదారులు చేర‌గా..వొడాఫోన్ ఐడియా 56 .97 ల‌క్ష‌లు, భారతీ ఎయిర్ టెల్ కు 15.08 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోయాయి. దీంతో ఉన్న స్థానాల నుంచి కింద‌కు చేరుకున్నాయి. 2016 సెప్టెంబ‌ర్ లో ఉచిత కాలింగ్, చౌక‌గా డేటా వాడుకోవ‌చ్చంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌కు దేశ వ్యాప్తంగా అనూహ్యమైన రీతిలో స్పంద‌న ల‌భించింది. మూడేళ్ల లోపే టెలికాం మార్కెట్‌లో ప్ర‌థ‌మ స్థానానికి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. జియో దెబ్బ‌కు విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకున్నాయి. ధ‌ర‌ల యుద్ధం తీవ్రం కావ‌డంతో నిర్వ‌హ‌ణ ప‌రంగా ఇత‌ర టెలికాం కంపెనీల‌కు త‌ల‌కు మించిన భారంగా మారింది. దీంతో టెలికాం రంగంలో ఆయా కంపెనీలు విలీనాల‌కు తెర‌లేపాయి. టెలినార్, ఎయిర్ సెల్, టాటా సెలీ వంటి చిన్న అరేట‌ర్ సంస్థ‌లు బ‌డా కంపెనీల్లోకి చేరిపోయాయి. జియో సంస్థ‌ను ఎదుర్కొనేందుకు వొడాఫోన్, ఐడియా సైతం ఒక్క‌ట‌య్యాయి. 40 కోట్ల‌తో దేశంలో అతి పెద్ద సంస్థ‌గా అవ‌త‌రించింది. కానీ రోజు రోజుకు క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. దీంతో జియో త‌న‌కు ఎదురే లేకుండా పోయింది.

కామెంట్‌లు