క‌న్న‌డ నాట క‌మ‌ల స‌ర్కార్ - సీఎంగా యెడ్డీ ప్ర‌మాణ స్వీకారం

ఎంతో ఉత్కంఠ‌కు తెర‌తీసిన క‌న్న‌డనాట రాజ‌కీయం స‌ద్దు మ‌ణిగింది. నాల్గ‌వ సారి బీజేపికి చెందిన బూక‌న‌కేరే సిద్ధిలింగ‌ప్ప యెడ్యూర‌ప్ప క‌ర్నాట‌క రాష్ట ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అశేష జ‌న‌వాహిని, అనుచ‌ర‌, అభిమానుల సందోహం మ‌ధ్య ఆయ‌న కొలువుతీరారు. గవ‌ర్న‌ర్ వాజూభాయి వాలా యెడ్డీతో సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అనంత‌రం ఆయ‌న‌ను ప్ర‌త్యేకంగా గ‌వ‌ర్న‌ర్ అభినందించారు. ఈ ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వానికి మాజీ ముఖ్య‌మంత్రి ఎస్.ఎం.కృష్ణ‌, బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్ రావుతో పాటు ఇత‌ర సీనియ‌ర్లు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ స‌ర్వార్‌పై ప్ర‌యోగించిన బ‌ల‌పీర‌క్ష‌లో త‌న బ‌లాన్ని నిరూపించుకోక పోవ‌డంతో ..అత్య‌ధిక సీట్లను క‌లిగి ఉన్న బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని అంతా భావించారు. నాట‌కీయ ప‌రిణామాల నేఫ‌థ్యంలో కొంత సందిగ్థ‌త నెల‌కొంది.

త‌ద‌నంత‌రం ప‌రిణామాలు అనూహ్యంగా మారి పోయాయి. ప్ర‌భుత్వం ఏర్పాటుకు త‌మ‌ను ఆహ్వానించాల‌ని కోరుతూ య‌డ్యూర‌ప్ప , త‌న అనుచ‌రుల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ వాజూబాయి వాలాను క‌లిసి విన్న‌వించారు. ఆయ‌న చేసిన విన‌తిని స్వీక‌రించిన గ‌వ‌ర్న‌ర్..స‌మ్మ‌తించ‌డంతో మ‌రోసారి క‌మ‌లం క‌న్న‌డ నాట కొలువు తీరింది. దీంతో రాజ్‌భ‌వ‌న్‌లో యూడ్యూర‌ప్ప సీఎంగా మ‌రోసారి ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే ఇంకా నాట‌కం అంతా అయిపోయినా ..ఆఖ‌రు అంఖానికి చేరుకుంది. అయితే అస‌లు ప‌రీక్ష మిగిలే ఉంది..విధాన‌స‌భ‌లో బ‌ల నిరూప‌ణ చేసుకోవాల్సి ఉంది. ఆ త‌ర్వాతే మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించ‌నున్నారు. కాగా, యెడ్డీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఇది నాలుగోసారి. మొద‌టిసారిగా 2007 సంవ‌త్స‌రం న‌వంబ‌ర్‌లో సీఎంగా బాధ్య‌త‌లు చేపట్టినా..చివ‌రి వ‌ర‌కు మ‌ద్ధ‌తు ఇస్తామ‌ని చెప్పిన జేడీఎస్ మాట మార్చింది. దీంతో ఆయ‌న నాలుగు రోజుల‌కే ఉన్న‌త ప‌ద‌వి నుండి వైదొలగాల్సి వ‌చ్చింది.

2008లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ భారీ విజ‌యం సాధించ‌డంతో రెండ‌వ సారి ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టారు. అప్ప‌ట్లో యెడ్యూర‌ప్ప‌పై అంతులేని అవినీతి, ఆరోప‌ణ‌లు రావ‌డంతో 2011 సంవ‌త్స‌రంలో తిరిగి త‌న సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. త‌నను బాధ్యుడిని చేస్తూ తొల‌గించ‌డంపై ఆయ‌న అలిగారు. 2012లో క‌ర్నాట‌క జ‌న‌తాప‌క్ష అనే పేరుతో క‌ర్నాట‌క‌లో కొత్త రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీని ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక పోయారు. దీంతో గ‌త్యంత‌రం లేక యెడ్డీ త‌న పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అదే ఏడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో షిమోగా పార్ల‌మెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. 2018లో బీజేపీ రాష్ట్ర ప‌గ్గాలు చేప‌ట్టిన ఆయ‌న ఆధ్వ‌ర్యంలో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. దీంతో స‌ర్క‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని కోరుతూ గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానించారు. దీంతో యెడ్డీ మూడోసారి ప్ర‌మాణ స్వీకారం చేసినా అది మూణ్ణాళ్ల ముచ్చ‌ట‌గా మారింది. అవ‌స‌ర‌మైన సంఖ్యా బ‌లాన్ని నిరూపించుకోలేక పోవ‌డంతో ..ప‌ద‌వి నుండి వైదొలిగారు. కాంగ్రెస్, జేడీఎస్ 14 నెల‌ల పాటు స‌ర్కార్ ను ఏర్పాటు చేసింది..విశ్వాసం వీగి పోవ‌డంతో యెడ్డీకి మార్గం సుగ‌మ‌మైంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!