ఓసీనే అందరి ఛాయిస్ - మస్తు మజా బాస్
ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. మనిషి జీవన విధానాన్ని శాసించే వాటిలో సవాలక్ష వ్యసనాలున్నాయి. వాటిలో మద్యం, సిగరెట్, ఉమెన్. ఉరుకుల పరుగుల జీవితంలో కాసింత వెసులుబాటు కోసం ..కూసింత తృప్తి కోసం జనం వీటిని ఆశ్రయిస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు, పబ్‌లు, మద్యం దుకాణాలు లెక్కలేనన్ని వెలిశాయి. ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు తాగుతున్నారు. ఒళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. ఈ మధ్య పాన్ మసాలాలు, పాన్ పరాఖ్‌లు , ఖిల్లీ కొట్లు , పాన్ షాప్‌లు లెక్కలేనన్ని వెలిశాయి. చిన్న స్థలం వుంటే చాలు. ఎవరైనా దాడులు చేస్తారేమోనని గల్లీలు వీటికి కేరాఫ్‌గా మారాయి. కావాల్సినంత గంజాయి దొరుకుతోంది. నాలుగో లేదా ఐదో అంతస్తులో నుల్చొని మెల్లగా గ్లాసులోకి ఒంపుకుని తాగుతూ..కిటికీ పక్కన ..స్నాక్స్ తీసుకుంటూ ..ప్రపంచాన్ని చూడటం చాలా మందికి అలవాటు..అది ఓ సరదా..ఇంకొందరికి అది కిక్కు ఇస్తుంది.
మరికొందరికి అదో స్టేటస్ సింబల్ . ప్రతి సాయంత్రం మందు ప్రియులకు కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ అదే తాగుతూ వుంటే ఏం మజా వుంటుంది కదూ. కొత్త వారితో స్నేహాలు, మద్యంతో చిందులు..భలే అనిపిస్తుంది లైఫ్. చాలా మందిని పైకొచ్చిన వాళ్లను అడిగినప్పుడు ..లైఫ్‌లో మీరు ఏ సమయంలో ఆనందంగా ఉన్నారని అడిగితే ..చాలా సాయంత్రాలు, రాత్రుళ్లు అని సమాధానం చెప్పారు అత్యధికంగా. ఎందుకంటే కాసింత సేదదీరే ఛాన్స్ మద్యంతోనే దొరుకుతుందంటారు. అందుకే ఎక్కువగా ఆఫీసర్స్ ఛాయిస్‌కు ఓటేస్తున్నారు. ఏ ముహూర్తంలో దీనిని తయారు చేయడం మొదలు పెట్టారో..ఇక అప్పటి నుంచి తనకంటూ ఎదురే లేకుండా చేసుకుంటోంది ఈ విస్కీ బ్రాండ్. దాని పేరే ఆఫీసర్స్ ఛాయిస్. అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ పేరుతో రిజిష్టర్ చేశారు. ఈ కంపెనీ పేరు మీదే ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. 1988లో దీనిని ప్రారంభించారు.
42.8 శాతం ఆల్కహాల్ ఈ విస్కీలో మిలితమై ఉంటుంది. గోధుమ రంగులో ఈ విస్కీ ఉంటుంది. తాజాగా బ్లూ కలర్‌లో కూడా లభిస్తోంది. ఆఫీసర్ ఛాయిస్ విస్కీ ..ఇండియాలోనే టాప్ బ్రాండ్‌గా ఉంటూనే ప్రపంచాన్ని ఊపేస్తోంది. రుచికరంగా, నాణ్యవంతంగా దీనిని తయారు చేస్తోంది కంపెనీ. దీనికి ఇంకో పేరుంది ఓసీ అని. అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ ను బిడిఏ పేరుతో పిలుస్తారు. వోడ్కో తర్వాత వరల్డ్‌లో అత్యధికంగా ఆఫీసర్స్ ఛాయిస్‌నే ఎంచుకుంటున్నారు. దానికే ఓటు వేస్తున్నారు. అది లేకుండా బతకలేమంటున్నారు అందరూ. 2014లో 28.4 మిలియన్ల కేసులు అమ్ముడు పోయాయి. ఇంత భారీ మొత్తంలో అమ్ముడు పోయిన విస్కీ ఏది లేదంటే అతిశయోక్తి కాదు. ఏబీడీ కంపెనీని కిషోర్ ఛాబ్రియా ఏర్పాటు చేశారు.
షా వాలెస్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. లిక్కర్ కింగ్ మేకర్‌గా ఉన్నారు. కోల్‌కొతా కేంద్రంగా ఇది నడుస్తోంది. మను ఛాబ్రియాతో కలిసి దీనిని స్టార్ట్ చేశారు. ఇద్దరి అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు రావడంతో వీడి పోయారు. కిషోర్ తన అన్న నుండి వేరుపడి ..ఢిల్లీలో కొత్తగా మరో కంపెనీ స్టార్ట్ చేశాడు. ఓనర్ షిప్ విషయంలో మరో వివాదం నడిచింది కిషోర్ ఛాబ్రియాకు విజయ్ మాల్యాకు మధ్యన. షా వాలెస్ కంపెనీ నుండి మను ఛాబ్రియా వైదొలిగారు. ఆఫీసర్స్ ఛాయిస్ ను టేకోవర్ చేసుకున్నారు. ఆ తర్వాత ..మాల్యాతో కూడా విభేదాలు రావడంతో బయటకు వచ్చారు కిషోర్ . అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ పేరుతో కంపెనీని స్థాపించారు. ఆఫీసర్స్ ఛాయిస్ అన్నది తన బ్రాండ్ అంటూ కోర్టుకు ఎక్కాడు మాల్యా.
కిషోర్ ఛాబ్రియా 8 కోట్లు ఇచ్చి దానిని తీసేసుకున్నారు. ఆదాయం కలిగిన వారిని దృష్టిలో ఉంచుకుని ఈ బ్రాండ్‌ను రూపొందించారు. అదే వారికి కనకవర్షం కురిపిస్తోంది. బ్లూ, బ్లాక్ వేరియంట్‌లలో మొదటగా తయారు చేశారు. 2013లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా అమ్ముడు పోయింది ఓసీ. 23.8 మిలియన్ కేసులు అమ్ముడు పోయాయి. జానీవాకర్ తర్వాత మన విస్కీనే టాప్. ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది మన విస్కీ. 2009లో 11.1 మిలియన్ కేసులు, 2010లో 11.6, 2011లో 16.5 , 2012లో 18.1, 2013లో 23.8, 2014లో 28.4 మిలియన్ల కేసులు అమ్ముడు పోయి రికార్డు సృష్టించింది ఆఫీసర్స్ ఛాయిస్. ప్రతి ఏటా గ్లోబల్‌లో తన అమ్మకాల వాటాను పెంచుకుంటూ పోతోంది ఓసీ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి