ఫిలిప్స్ ఇన్నోవేషన్ సెంటర్ సిఇఓగా కళావతి
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ నేమ్ కలిగిన ఫిలిప్స్ ఇండియా ఇన్నోవేషన్ క్యాంపస్‌కు కళావతిని ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఆ సంస్థ నియమించింది. ఈ కీలకమైన నిర్ణయాన్ని ఇటీవలే ప్రకటించింది. 2019 మే 2వ తేదీ నుండి ఆమె తన బాధ్యతలను నిర్వహించడం ప్రారంభిస్తుందని పేర్కొంది. ఒక మహిళను అంతర్జాతీయ సంస్థకు ముఖ్య పదవికి ఎంపిక చేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గ్లోబల్ కస్టమర్ సర్వీస్, ఆపరేషన్స్ ఫర్ ఫిలిప్స్ హెల్త్ కేర్ ఇన్ ఫార్మాటిక్స్ బిజినెస్ కు హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా పిఐసీకి సిఇఓగా శ్రీనివాస్ ప్రసాద్ సమర్థవంతంగా పనిచేశారు.
ఫిలిప్స్ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను బెంగళూరులో 1996 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ క్యాంపస్‌లో సాఫ్ట్ వేర్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్ పై కాన్ సెంట్రేషన్ చేస్తుంది. ఈ రీసెర్చ్ యూనిట్‌లో 3 వేల 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. హెల్త్ కేర్ రంగంలో సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తోంది పీఐసీ కంపెనీ. ఇదే రంగానికి సంబంధించి 23 ఏళ్ల అనుభవం కలిగి ఉన్నారు జివి కళావతి. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ రంగాలలో అపారమైన అనుభవాన్ని గడించారు. ఈ విషయంలో ఫిలిప్స్‌కు సరైన మార్గదర్శకత్వం నెరిపే లక్షణాలు కలిగి ఉన్న అధికారిణిగా కళావతిని ఎంపిక చేస్తున్నట్లు ఫిలిప్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని సిఇఓగా ఎంపికైన కళావతి పేర్కొన్నారు.
ఇది వరకు కొన్నేళ్ల పాటు ఫిలిప్స్ ఇన్నోవేషన్ క్యాంపస్ కు విశిష్ట సేవలందించారు శ్రీనివాస్ ప్రసాద్. ఆయన తన లాంటి వారందరికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తారు. ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, వారిని సమర్థవంతమైన వ్యక్తులుగా మార్చడంలో ఆయన ఎంతగానో శ్రమించారు. ఆయన అందించిన సర్వీసెస్ వెలకట్టలేనిది. ఎప్పుడూ మమ్మల్నందరిని ప్రభావితం చేస్తూనే ఉంటారని వినమ్రంగా చెప్పారు కళావతి. ఇండియా పరంగా చూస్తే ప్రస్తుతం డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ రంగం డామినేట్ చేస్తోంది. సామాజిక మాధ్యమాలు, ఐటీ దిగ్గజాలు, హెల్త్ కేర్ రంగాలకు చెందిన కంపెనీలు, ఎంటర్ టైన్ మెంట్, లాజిస్టిక్స్ రంగాలన్నీ దీని మీదే ఆధారపడ్డాయి.
మా ముందు పెను సవాళ్లు ఉన్నాయి. వాటిని పరిష్కరించు కోవడం మా ముందున్న లక్ష్యం అని తెలిపారు. కళావతి 2007లో కాంపౌండ్ టోమోగ్రఫీ ఇంజనీరింగ్ టీంలో సభ్యురాలిగా చేరారు. పొజిట్రాన్ ఎమిస్సిన్ టోమోగ్రఫీ - మ్యాగ్నటిక్ రిజోనాన్స్ ఇమేజింగ్ 2010లో సెగ్మెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఫిలిప్స్ ఆర్ అండ్ డి లీడర్‌గా ఎదిగారు. మైసూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు కళావతి. మొత్తం మీద దిగ్గజ కంపెనీకి సిఇఓగా పనిచేయడం అంటే మామూలు మాటలు కాదు కదూ. ఎంతో నిబద్ధత కలిగిన ఈమె మహిళా సాధికారతకు దర్పణంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి