అంచనాలు పెంచుతున్న కపిల్‌దేవ్ బయోపిక్
క్రికెట్ ఆటకు వన్నె తెచ్చిన మొనగాడు. నరనరాల ప్రతి రక్తపు బొట్టులోను దేశం పట్ల అచంచలమైన నమ్మకం, గౌరవం కలిగిన ఆటగాడు. అరుదైన క్షణాలను సైతం జాతికి అంకితం చేసిన అతి గొప్ప క్రికెటర్లలో అతను ఒకడు. ఒకానొక సందర్భంలో ఫిక్సింగ్ ఆరోపణల్లో తన పేరు వచ్చినప్పుడు చిన్న పిల్లాడిలా ఏడ్చిన మనిషి. అంతకంటే ఎక్కువగా ఇండియాకు తన సారథ్యంలో మొదటి సారిగా ప్రపంచకప్‌ను తీసుకు వచ్చిన మొట్ట మొదటి కెప్టెన్, ఆల్ రౌండర్ హర్యానా కరేన్ కపిల్ దేవ్ నిఖంజ్. క్రికెటర్లకు ఉన్నంత క్రేజ్, పాపులారిటీ ఇంకెవ్వరికీ లేదు ముఖ్యంగా భారతదేశంలో. వారిని దేవుళ్లకంటే ఎక్కువగా కొలుస్తారు.
వారి తర్వాత సెలబ్రెటీస్. అందుకే మోస్ట్ పాపులర్ పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నారంటే క్రికెటర్ల తర్వాతే ఎవరైనా. భారత జట్టుకు ఎనలేని విజయాలను సాధించి పెట్టిన మణికట్టు మాంత్రికుడు మహ్మద్ అజారుద్దీన్ తో పాటు ఇండియన్ క్రికెట్ లెజండ్ గా భావించే సచిన్ రమేష్ టెండూల్కర్, ఎం.ఎస్. ధోనీ లపై ఇప్పటికే బయోపిక్‌లు సినిమాలుగా వచ్చాయి. లిటిల్ మాస్టర్ మూవీ అంతగా ఆడక పోగా, మిస్టర్ కూల్, రిస్టీ ప్లేయర్ అజార్‌ల బయోపిక్‌లు కొంత మేరకు సక్సెస్ ఫుల్‌గా నడిచాయి. ఆ బాటలోనే తాజాగా ఫాస్టెస్ట్ బౌలర్‌గా పేరొందిన కపిల్ దేవ్ జీవిత చరిత్రను బయోపిక్‌గా తీసేందుకు బాలీవుడ్ ప్రయత్నిస్తోంది.
క్రికెట్‌లో ఎప్పుడైతే ఇండియాకు కప్పును సాధించి పెట్టాడో, అప్పటి నుంచి భారత జాతి యావత్తు క్రికెట్‌ను స్మరిస్తోంది..ఆస్వాదిస్తోంది. ఇక బయోపిక్‌లో కపిల్ దేవ్ ప్లేస్‌లో యాక్టర్‌గా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు. ఇప్పటికే రణ్‌బీర్ కు ఇండియాలో ఎనలేని క్రేజ్ ఉంది. టాప్ హీరోలలో అతను ఒకడిగా వెలుగొందుతున్నాడు. కళ్లు, బాడీ అంతా కొంచెం కపిల్ లాగే ఉండడంతో దర్శకుడు అతడినే ఎంపిక చేసుకున్నాడు. ఇక కపిల్ దేవ్ గురించి చెప్పేదేముంది. కపిల్ అంటేనే ఇండియా..ఇండియా అంటేనే కపిల్ అన్నంతగా ఆయన మోస్ట్ పాపులర్ ఫిగర్‌గా ఉండి పోయారు. క్రికెట్ నుంచి రిటైర్ అయినా ఏదో రకంగా సేవలందిస్తూనే వున్నారు.
తాజాగా అమెరికాలో జరిగిన తానా సభల్లో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కపిల్‌దేవ్ మాట్లాడిన ప్రతి మాటకు హాజరైన వారంతా చప్పట్లతో వెన్నుతట్టారు. మీరు ఎక్కడికైనా వెళ్లండి. ప్రపంచంలో ఏ దేశమైనా సందర్శించండి లేదా అక్కడే ఉండి వ్యాపార రీత్యానో లేదా ఉద్యోగ పరంగానో స్థిర పడినా సరే ముందు మీరెవరని అడిగితే ..నా దేశం ఇండియా అని గర్వంగా చెప్పండి అంటూ పిలుపునిచ్చారు. క్రికెట్ నుండి రిటైర్ అయినా ఆయన తనలోని దేశ భక్తిని మరిచి పోలేదు. తనలో ఇంకా మానవత్వం బతికే ఉందని చాటి చెప్పారు. కపిల్ దేవ్-ఇన్ 83 పేరుతో బయోపిక్ త్వరలో మన ముందుకు రాబోతోంది.
ఇందు కోసం రణ్ బీర్ సింగ్ తన బాడీ స్టయిల్‌ను మార్చేశాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. బౌలింగ్ లో మెళకువలు నేర్చుకుంటున్నాడు కపిల్‌దేవ్‌తో కలిసి. ఇందులో విశేషం ఏమిటంటే తన భార్య దీపికా పదుకోనే తో కలిసి ఈ సినిమా చేస్తున్నాడు రణ్ బీర్. వీరిద్దరు లీడ్ రోల్స్ పోషిస్తుండగా సపోర్ట్ రోల్స్‌లో పంకజ్ త్రిపాఠి, సఖిబ్ సలీం, తాహిర్ రాజ్ భాసిన్, జతిన్ శర్మ, అమ్మీ విర్క్, హార్డీ సంధు నటించనున్నారు. ఈ బయో పిక్‌కు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని 2020 ఏప్రిల్ 10 దేశ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు డేట్స్ కూడా ఖరారు చేశారు నిర్మాత. సో..అంత దాకా వేచి చూడాల్సిందే మరి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి