ఐసీసీ రేటింగ్స్‌లో మనోళ్లే టాప్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన రేటింగ్స్‌లో మన ఆటగాళ్లు టాప్ లో నిలిచారు. ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, రెండో ప్లేస్‌లో ఇండియన్ ఓపెనర్ రోహిత్ శర్మలు ఉండగా వీరిద్దరి మధ్య కొన్ని పాయింట్ల తేడా ఉండడం విశేషం. వీరిద్దరి మధ్య ఐసీసీ ర్యాంకింగ్ నెంబర్ వన్ రేసు మరింత ఇంట్రస్టింగ్ గా మారింది. టీమిండియా స్కిప్పర్ కోహ్లి మరోసారి నెంబర్ -1 ఐసీసీ వన్డే బ్యాట్స్ మెన్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. అయితే నెంబర్ -2 ప్లేస్‌లో ఉన్న రోహిత్ శర్మ ..ఈసారి తన పాయింట్లను భారీగా పెంచుకుని ..నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. జాబితాలో రెండో స్థానంలో నిలిచినప్పటికీ ..కోహ్లికి రోహిత్ శర్మకు మధ్య కేవలం 6 పాయింట్ల తేడా మాత్రమే ఉన్నది.
ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొన్నాయి. ఈ మెగా టోర్నీలో విరాట్ కోహ్లి 891 పాయింట్స్ దక్కించు కోవడంతో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. విరాట్ వరల్డ్ కప్‌లో అయిదు ఆఫ్ సెంచరీలు సాధించాడు. ఐతే ..వరల్డ్ కప్‌లో అత్యధికంగా 5 సెంచరీలు సాధించి..వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన ఓపెనర్ రోహిత్ శర్మ885 పాయింట్లు సాధించి కోహ్లికి కేవలం కొద్ది పాయింట్ల దూరంలో నిలిచాడు. రేపు జరగబోయే మ్యాచ్‌లలో ఒకవేళ పరుగులు సాధిస్తే..రోహిత్ శర్మ ప్రథమ స్థానం చేజిక్కించు కోవచ్చు. ఇక పాకిస్తాన్ జట్టుకు చెందిన సూపర్బ్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజామ్ 4 పాయింట్లు పెంచుకుని టాప్ 3 పొజిషన్‌లో నిలిచాడు. ఈ క్రికెటర్‌కు మొత్తం పాయింట్లు 827 పాయింట్లు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహిస్తున్న క్రికెటర్ డుప్లిసిస్ 820 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
మరో వైపు ..అయిదో స్థానంలో రాస్ టెయిలర్ 813 పాయింట్లు సాధించి తాను రేసులో ఉన్నానని ప్రకటించాడు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ 803 పాయింట్లతో 6వ ప్లేసు పొందాడు. ఏడవ స్థానంలో జోయే రూట్ 791 పాయింట్లు సాధించి నిలిచాడు. ఇక ఎనిమిదో ప్లేస్‌లో కేవలం ఒకే ఒక్క పాయింట్ తేడాతో 790 పాయింట్లు సాధించి వెనక్కి నెట్టబడ్డాడు. తొమ్మిదో స్థానంలో డీ కాక్ 781 పాయింట్లు సాధించి నిలవగా, ఆరోన్ ఫించ్ 778 పాయింట్లు సాధించి పదో స్థానాన్ని సాధించి ప్రతిభ చూపారు. తాజా రేటింగ్స్‌లో ఆయా జట్లకు చెందిన క్రికెటర్లు తక్కువ పాయింట్ల తేడాతో ర్యాంకులు సాధించడంతో ...మరికొద్ది మ్యాచ్‌లు ఆడితే కనుక ..ప్లేస్‌లు మారిపోయేందుకు ఆస్కారం ఉంది. మొత్తం మీద వరల్డ్ కప్ పై కన్నేసిన విరాట్ కోహ్లి సేన ..ఈ ర్యాంకులను పట్టించు కోవడం లేదు..భారత జాతితో పాటు భారత క్రికెటర్లు కప్పు కోసమే వేచి వున్నామని అంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి