ఎనీ టైం లోన్ ..ఎప్పుడైనా ఎక్కడైనా - అప్పు ఇంత ఈజీనా..!
సంపాదించడం ఏమో కానీ ఈ లోకంలో రుణం పొందాలన్నా..అప్పు చేయాలన్నా సవాలక్ష నిబంధనలు..లెక్కలేనన్ని కారణాలు. ఒక్కోసారి అనుకోకుండా డబ్బులున్నా సమయానికి బ్యాంకులలో..ఏటీఎంలలో డబ్బులుండవు. ఖాతాల్లో లెక్కలేనంత క్యాష్ వున్నా ..ఆపదలో ఆదుకోని పరిస్థితి ఎదురవుతుంది. బంగారాన్ని, ప్లాట్లను, ఫ్లాట్లను, నగలను, ఇండ్ల కాగితాలను తాకట్టు పెట్టినా డబ్బులు చేతికి అందవు. ఇలాంటి పరిస్థితులను స్వతహాగా అనుభవించిన ఓ జంట ఏర్పాటు చేసిన సంస్థ ఏకంగా కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తోంది. పక్కా ప్లానింగ్..రిజల్ట్ వచ్చే దాకా కష్టపడితే అనుకున్నది సాధించవచ్చని హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఎనీ టైం లోన్ స్టార్టప్ నిరూపిస్తోంది. వీరిద్దరి కథ ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. టైంను వేస్ట్ చేస్తూ..గడిపే కంటే ఇలా డిఫరెంట్‌గా ఆలోచిస్తే కొంతలో కొంతైనా తమ కాళ్ల మీద తాము నిలబడే అవకాశం ఉంది.
ఇండియాలో ఆంట్రప్రెన్యూర్స్, స్టార్టప్‌ల సందడి పెరిగింది. ప్రైవేట్ సంస్థలే కాకుండా ప్రభుత్వాలు ప్రత్యేకంగా వీరి కోసం ఐటీ విభాగంలో భాగం చేశాయి. ఈ భార్యాభర్తలకు ఒకానొక సందర్భంలో ఓ జంటకు అర్జెంట్‌గా డబ్బులు అవసరమయ్యాయి. కానీ ఎక్కడా దొరకలేదు. దీనిని ఈ జంట గమనించింది. అప్పుడే వచ్చిన ఆలోచన అంకుర సంస్థగా మారిపోయిందే..అదే ఎనీ టైం లోన్. ఎలాంటి నిబంధనలు లేకుండానే జస్ట్ రిజిస్టర్ చేసుకుంటే చాలు..అంతా స్మార్ట్ ఫోన్లలోనే నిమిషాల్లో ఎలాంటి కాగితాలు, ఒప్పందాలు, సంతకాలు లేకుండానే అప్పు మంజూరవుతుంది. మన బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది. 2014లో కీర్తి కుమార్ జైన్, నేహా జైన్‌లు ఈ లెండింగ్ సంస్థను స్థాపించారు. తక్కువ వడ్డీ..ఈజీ ప్రాసెసింగ్..నో రిస్ట్రిక్షన్స్..వెసలుబాటు కల్పించేలా అప్పు మంజూరు చేయడం దీని ప్రత్యేకత. స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే ఇండియాలో టాప్ టెన్ లెండింగ్ సంస్థలో ఎనీ టైం లోన్ చేరింది. ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి.
ఎంతో నమ్మకంతో ప్రారంభించిన ఈ కంపెనీలో పలు పేరొందిన సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఫిన్ టెక్ సెక్టార్‌లో ఇది టీ హబ్‌లో రిజిష్టర్ చేశారు. 4 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇందులోకి వచ్చి పడ్డాయి. ఈ సంస్థ ద్వారా వేలాది మంది తమ అవసరాలు తీర్చుకునేందుకు అప్పులు పొందారు. క్రమం తప్పకుండా తీర్చారు. తక్కువ వడ్డీ కావడం..ఇబ్బందులు పడకుండానే ఖాతాల్లో జమ కావడంతో..దీనినే ఫాలో అవుతున్నారు వీరితో పాటే ఇతరులు కూడా. నో పేపర్ వర్క్..అంతా డిజిటల్ ద్వారానే సాగుతుంది ఈ రుణాల ప్రాసెస్. ఎనీ టైం లోన్ అన్నది పీర్ టు పీర్ లెండింగ్ ఫ్లాట్ ఫారం మీద నడుస్తుంది. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ద్వారా ఈ సంస్థ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా నమోదు చేసుకుంటే చాలు. మీ లెండింగ్ కెపాసిటీ, మీరు నిర్వహించిన లావాదేవీల సమాచారం అంతా వారికి తెలిసి పోతుంది. వీటన్నింటిని ఏవీ పట్టించు కోరు. అప్పులు ఇచ్చేవాళ్లు ..రుణాలు పొందే వారి మధ్య ఈ సంస్థ వారధిగా పనిచేస్తుంది.
ఇంత చేస్తే సంస్థకు ఏం లాభం వస్తుందనే అనుమానం రాక తప్పదు. వేలాది మంది లెండింగ్ కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉంటారు. వారి అవసరాలను గుర్తించి ప్రయారిటీ బేసిస్ మీద నిమిషాల్లో అనుమతి ఇస్తుంది ఈ సంస్థ. కేవలం నమ్మకం మీదనే నడుస్తోంది లెండింగ్ కంపెనీ. కీర్తి ఐఐఎం, ఐఎస్‌బీలో 14 ఏళ్ల పాటు ఫైనాన్షియల్ విభాగంలో పనిచేశారు. తన 32 ఏళ్ల భార్య నేహా జైన్‌తో కలిసి ఎనీ టైం లోన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే 43 వేల మంది అప్పులు పొందారు. 80 కోట్లు అందించారు. హైద్రాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ ఇపుడు దేశమంతటా విస్తరించింది. ఈ సంస్థలో పర్సనల్ లోన్స్, ఎడ్యూకేషన్ లోన్స్, ఎంఎస్ఎంఇ విభాగాల్లో రుణాలు పొందవచ్చు.
ఒన్ టైం దీనిలో రిజిష్టర్ చేసుకుంటే చాలు అప్పు ఈజీగా పొందవచ్చు. 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారు. రుణ గ్రహీతలతో పాటు పెట్టుబడి పెట్టే వాళ్లు ఇందులో కీలకం. అప్పులు ఇవ్వాలన్నా..వడ్డీ తీసుకోవాలంటే ఆర్‌బిఐ అనుమతి తప్పనిసరి. దీంతో సంస్థ పి2పి ఎన్‌బిఎఫ్‌సి నుండి లైసెన్స్ పొందింది. ఒక్క 2017-2018 సంవత్సరంలో 39.8 కోట్లను రుణంగా అందజేసింది. ఇందుకు గాను 3 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించింది ఈ సంస్థ. మరో 100 కోట్ల వ్యాపారాన్ని చేయాలన్నది తమ ముందున్న లక్ష్యమని అంటున్నారు ఈ జంట. సవాలక్ష ఇబ్బందులు ఎదుర్కొనేకంటే ఈజీగా మనీ దొరికే ఎనీ టైం లోన్‌ను సంప్రదిస్తే అవసరాలు తీరుతాయి. ఆనందం మనదవుతుంది..కదూ..ఇంకెందుకు ఆలస్యం..ట్రై చేయండిక.!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి