చిందేసిన చిరు..సందడి చేసిన ఖుష్బూ


తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్, ఇమేజ్ ను స్వంతం చేసుకున్న మెగా స్టార్ చిరంజీవి ఏది చేసినా సంచలనమే. అయన మాట్లాడినా లేదా డ్యాన్స్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా అయన తెలంగాణకు చెందిన డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన సైరా నరసింహ్మ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో చిరంజీవి శక్తికి మించి నటించారు. తన నటనతో ఆకట్టుకున్నారు. తన సినీ కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ మూవీగా సైరా సినిమానే అంటూ స్పష్టం చేశారు ఈ మెగాస్టార్. ఇదిలా ఉండగా 1980 లో తెలుగు, తమిళ్, కన్నడ సినీ రంగానికి చెందిన నటీనటులు ఒకే చోట ప్రతి ఏడాది సమావేశం కావడం జరుగుతూ వస్తోంది.

ఈ సారి స్పెషల్ గా మాంచి ఊపు మీదున్న చిరంజీవి తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. మరిచిపోని జ్ఞాపకాలను మిగిల్చారు. ఈ సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన పాత రోజుల్లోకి వెళ్లి పోయారు. క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌ రీ యూనియన్‌ పదో యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో అలనాటి తారలతో కలిసి చిరంజీవి ఫుల్ గా ఎంజాయ్‌ చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బంగారు కోడిపెట్ట సాంగ్‌కు ఆయన ఖుష్భూతో డ్యాన్స్‌ చేశారు. మధ్యలో జయప్రద కూడా చిరుతో జత కలిశారు.

కాగా 1980లలో నటించిన స్టార్స్‌ ప్రతీ ఏడాది సరదాగా కలసి రీయూనియన్‌ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రీ యూనియన్‌ను చిరంజీవి హోస్ట్‌ చేశారు. ఈ పార్టీ హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో జరిగింది. ఈ వేడుకకు 40 మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన నటీనటులున్నారు. మొత్తం మీద హీరో చిరంజీవి వేసిన స్టెప్పులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!