బైజూకు భారీ ఆదాయం - స్టార్ట‌ప్‌లో నెంబ‌ర్ వ‌న్

ఏదో స‌రదా కోసం ఏర్పాటైన బైజూ స్టార్ట‌ప్ కంపెనీ ఇవాళ భారీ ఆదాయాన్ని వెన‌కేసుకుంటోంది. ఐడియాలు వుంటే చాల‌దు..వాటిని స‌మ‌యానికి త‌గ్గ‌ట్టు అడాప్ట్ చేసుకుంటే కోట్లాది రూపాయ‌లు మ‌న చెంత‌కు చేరుకుంటాయ‌న్న దానికి బైజూ ఒక్క‌టే ఉదాహ‌ర‌ణ‌. 2018 ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసే స‌మ‌యానికి బైజూ రెవిన్యూ ప‌రంగా త‌న ఆదాయాన్ని అంచ‌నాల‌కు మించి పెంచుకుంది. ఒక‌టి కాదు ఏకంగా 490 కోట్ల‌ను కొల్ల‌గొట్టింది. ఇది ఇండియ‌న్ అంకుర సంస్థ‌ల్లో ఒక రికార్డుగా భావించాలి. 2019 ఏప్రిల్ నెలనాటికి చూసుకుంటే..బైజూకు ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌లే క్రేజ్ ద‌క్కింది. దీంతో యాడ్ రెవిన్యూ కూడా పెరిగింది.

నెల నెలా ఆదాయం 200 కోట్ల రూపాయ‌ల‌కు చేరుకుంది. ఈ సంవ‌త్స‌రం పూర్త‌య్యే నాటికి బైజూ ద‌గ్గ‌ర ర‌మార‌మి 3000 వేల కోట్ల రూపాయ‌లు ఉంటాయ‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. బెంగ‌ళూరు కేంద్రంగా బైజూ ఆన్ లైన్ ట్యూట‌ర్ సంస్థ‌గా ప్రారంభ‌మైంది. ఈ సంస్థ త‌యారు చేసిన యాప్ కొద్ది స‌మ‌యంలోనే మిలియ‌న్ల స‌బ్ స్క్రైబ‌ర్స్‌ను స్వంతం చేసుకుంది. మార్చి 2019 నాటికి బైజూ వాస్త‌విక రెవిన్యూ 1430 కోట్ల రూపాయ‌లుగా న‌మోదైంది. అద‌నంగా 2018లో 430 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో బైజూ ప‌నిచేస్తోంది. మొద‌ట్లో ఉచితంగా అన్ని సేవ‌లు యాప్ ద్వారా అంద‌జేసిన బైజూకు రాను రాను డిమాండ్ పెరిగింది.

దీంతో దానిని వాడుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాల్సిందేనంటూ నిర్వాహ‌కులు స్ప‌ష్టం చేశారు. కంటెంట్ తో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ ఉండ‌టం, కావాల్సినంత ఎక్స్ ప‌ర్ట్స్ స‌ల‌హాలు, సూచ‌న‌లు, శిక్ష‌ణ ఇవ్వ‌డం కూడా అద‌న‌పు అడ్డాంటేజ్‌గా మారింది. 60 శాతానికి పైగా స్టూడెంట్స్ అంతా దేశంలోని ఇత‌ర న‌గ‌రాల‌కు చెందిన వారే ఉంటున్నారు. టాప్ ప‌ది న‌గ‌రాల‌కు చెందిన వారే ఇందులో స‌భ్యులుగా న‌మోదు చేసుకున్నారు. లెర్నింగ్ ప్రోగ్రామ్స్‌ను క్రియేట్ చేశారు. ఆయా ప్రాంతీయ భాష‌ల్లో వీటిని రూపొందించారు.

దీంతో ఆయా ప్రాంతాల‌కు చెందిన విద్యార్థుల‌కు చ‌దువు కోవ‌డం ఏమంత క‌ష్టం కాక పోవ‌డంతో బైజూ అంటూ క‌ల‌వ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే బైజూలో 35 మిలియ‌న్ల మంది వాడుకోగా..2.4 మిలియ‌న్ల మంది స‌బ్ స్క్రైబ‌ర్స్‌గా ఉన్నారు. 2018 జూన్ నెల వ‌ర‌కు ..మ‌రింత పెరిగారు . మొత్తం మీద బైజూ ఆన్ లైన్ ట్యుటోరియ‌ల్ స్టార్ట‌ప్ కోట్లాది రూపాయ‌ల‌ను కొల్ల‌గొడుతోంది. చ‌దువంటే స‌ర్టిఫికెట్లు కాదు..కాసింత తెలివి కూడా.

కామెంట్‌లు