వన్ మ్యాన్ షో - ఇండియా విన్ - రాణించిన రోహిత్
భారతీయ క్రికెట్ వీరాభిమానులకు కొంత ఊరట లభించింది. పడుతూ లేస్తూ సాగిన వరల్డ్ క్రికెట్ టోర్నీలో మ్యాచ్ లో ఇండియా - దక్షిణాఫ్రికాల మధ్య సౌథాంప్టన్ లో ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ..బోణీ కొట్టింది. ఇండియాకు టోర్నీ పరంగా ఇది ప్రారంభ మ్యాచ్. ఇరు జట్లు విజయం కోసం పోరాడాయి. ఒకానొక దశలో సౌతాఫ్రికా బౌలర్లు భారత బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేశారు. అంతకు ముందు దక్షిణాఫ్రికా జట్టు 229 పరుగులు మాత్రమే చేసింది. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో ఆ జట్టు బ్యాట్స్ మెన్స్ ఎక్కువ పరుగులు చేయలేక పోయారు. మరో వైపు ఇండియన్ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారు.
చాహాల్ 51 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా, బుమ్రా 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మరో ఆటగాడు 44 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. పరుగులు తీసేందుకు నానా తంటాలు పడ్డారు సౌతాఫ్రికా ఆటగాళ్లు. ఇక టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియన్ క్రికెటర్స్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. సౌతాఫ్రికా జట్టుకు చెందిన బౌలర్లు క్రిస్ మోరిస్, రబాడా పోటీపడి బౌన్సర్లు వేశారు. భారత బ్యాట్స్ మెన్స్ హడలెత్తి పోయారు. వీరిద్దరి ధాటికి శిఖర్ ధావన్ 8 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇండియన్ కెప్టన్ విరాట్ కోహ్లి 34 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క ఫోర్ తో 18 పరుగులు చేసి నిరాశ పరిచాడు.
16వ ఓవర్ లో క్వాయో వేసిన అద్భుతమైన బంతికి ఔటయ్యాడు.
మరో వైపు స్కోర్ పూర్తిగా నత్తనడకన సాగింది. ఇండియన్ ఫ్యాన్స్ నీరుగారి పోయారు. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన కేఎల్ రాహుల్ తో పాటు రోహిత్ శర్మ నిదానంగా ఇన్నింగ్స్ ను చక్కదిద్దేందుకు ప్రయత్నం చేశారు. 42 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు రాహుల్. రోహిత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు సౌతాఫ్రికా బౌలర్లను వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు రాబట్టాడు.
విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రాహుల్ అవుటయ్యాక..మాజీ కెప్టెన్ ధోనీ రోహిత్‌కు బాసటగా నిలిచాడు. వీరిద్దరు టార్గెట్‌ను అందుకునేలా చేశారు. ధోనీ 46 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లున్నాయి. రాహుల్, ధోనీలు సపోర్ట్ ఇవ్వడంతో రోహిత్ శర్మ 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 144 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు కొట్టాడు. మొత్తం మీద ఇండియా రోహిత్ ఒక్కడి వల్ల గెలిచింది. పరువు పోకుండా కాపాడుకుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి