టాప్ స్టార్ట్అప్ లు ఇవే - లిస్ట్ ప్రకటించిన లింక్డ్ ఇన్ - ఓయో నే నంబర్ వన్

సోషల్ మీడియాలో ప్రపంచంలో టాప్ పొజిషన్ లో ఉన్న లింక్డ్ ఇన్ కంపెనీ తాజాగా భారత దేశంలో విజయవంతగా నడుస్తున్న స్టార్ట్ అప్ ల జాబితాను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఎన్నో అంకుర సంస్థలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట స్టార్ట్ అప్ స్టార్ట్ అవుతూనే ఉన్నది. అయితే వేలాది అంకుర సంస్థల్లో వడపోసి సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న వాటిలో 25 స్టార్ట్ అప్ లను వెల్లడించింది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, చైనా , ఫ్రాన్స్ , జెర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ , నెదర్లాండ్స్ దేశాల్లో కూడా టాప్ స్టార్ట్ అప్ ల లిస్ట్ ప్రకటించింది.

ఇక ఇండియా వరకు వస్తే, మొదటి స్థానంలో రితీష్ అగర్వాల్ తన ఐడియాతో ప్రపంచాన్నిషేక్ చేసిన ఓయో కంపెనీ నిలిచింది. గూర్గావ్ కేంద్రంగా ఈ సంస్థ నడుస్తోంది. హోటల్ పరిశ్రమల్లో అద్దె ప్రాతిపదికన చేస్తున్న దీని వ్యాపారం ప్రపంచంలోని కొన్ని దేశాలకు విస్తరించింది. ఇండియాతో వైరం కలిగిన చైనాలో అత్త్యధిక హోటల్స్ ను ఓన్ చేసుకున్న ఒకే ఒక్క కంపెనీ ఓయో ఒక్కటే. దీని ద్వారా ఇప్పటికే వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. హోటల్ యజమానులకు గణనీయంగా ఆదాయం సమకూరుతోంది. హోటల్స్ అండ్ హోమ్ హాస్పిటాలిటీలో ఓయో ప్రథమ స్థానంలో నిలిచింది.

హెల్త్,  ఫిట్ నెస్ అండ్ వెల్ నెస్ విభాగాలలో టాప్ రేంజ్ లో ఉన్న క్యూర్ ఫిట్ స్టార్తప్ రెండో స్థానంలో నిలిచింది. ప్రతి ఏటా 100 మిలియన్ల ఆదాయం పొందుతోంది ఈ కంపెనీ. ముకేశ్ బన్సల్ దీనిని ఏర్పాటు చేశారు. ఇక బెంగళూర్ కేంద్రంగా పనిచేస్తున్న టాప్ చీఫ్ మూడో స్థానం పొందింది. ఇంజనీరింగ్, బిజినెస్ ఆపరేషన్స్ లలో ఇది పనిచేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాజోర్ పే స్టార్తప్ నాలుగో ప్లేస్ దక్కించుకుంది. ఇదే నగరానికి చెందిన బౌన్స్ ఐదో స్థానంతో సరిపెట్టుకోగా  ఉద్యోగాల కల్పనలో రికార్డ్ సృష్టించింది. స్థాపించి కేవలం 10 నెలలే అయినప్పటికీ 5 వేల మందికి జాబ్స్ ప్రొవైడ్ చేసింది.

ఆరో స్థానంలో పేమెంట్ ఉండగా, ఏడో ప్లేస్ లో  గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న రివిగో ఉన్నది. సప్లై చైన్ , లాజిస్టిక్స్, ఆపరేషన్స్ మేనేజ్ మెంట్స్ పై ఈ కంపెనీ ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఏకో ఎనిమిదో స్థానం దక్కించుకోగా , తొమ్మిదో ప్లేస్ లో  ఎంఫైన్ పొందింది. పదో స్థానంలో ఇంటర్వ్యూ బిట్ స్టార్తప్ ఉండగా , 11 వ ప్లేస్ లో  ఉదాన్ నిలిచింది. లిట్టిల్ బ్లాక్ బుక్ 12 వ స్థానం చేజిక్కించుకోగా , పదమూడో స్థానంలో డాంజో ఉండగా , 14 వ ప్లేస్ లో ముంబై కేంద్రంగా ఉన్న అప్ గ్రాడ్ పొందితే , పదిహేనో ప్లేస్ లో నినాలీ యాప్స్ వుంటే, పదహారో స్థానంలో సింపుల్ , పదిహేడో ప్లేస్లో మీషూ ఉండగా , 18 వ స్థానంలో బెంగళూర్ కేంద్రంగా పనిచేస్తున్న డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ నిలిచింది.

దాదాపు 200 కోట్ల ఆదాయాన్ని గడించింది. 19 వ స్థానంలో కార్జా టెక్నాలజీస్ ఉండగా , 20 వ స్థానంలో స్టార్స్ ఫిన్ స్టార్ట్ అప్ నిలిచింది., ఇరవై ఒకటో ప్లేస్ లో ప్రిస్టిన్ కేర్ ఉంటే . 22 వ స్థానంలో వైట్ హ్యాట్ జూనియర్ ఉండగా , 23 వ ప్లేస్ లో బీజింగో స్టార్ట్ అప్ పొందితే 24 వ స్థానంలో స్మార్ట్ వర్క్స్ నిలిచింది. ఇక ఇరవయ్యో ఐదో ప్లేస్ లో స్టాంజా లివింగ్ పొందింది. మొత్తం మీద కొత్త ఐడియాలతో ఏర్పాటు చేసిన అంకురాలు టాప్ రేంజ్ లోకి రావడం వల్ల మరిన్ని స్టార్ట్ అప్ లు కొత్తగా ప్రారంభించేందుకు దోహద పడుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా ..పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. 

కామెంట్‌లు