తాగి తూలడంలో ఇండియన్సే టాప్
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండోదిగా పేరొందిన ఇండియా ఇపుడు మద్యాన్ని సేవించడంలో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించేసింది. తాగేందుకు నీళ్లు లేక పోయినా సరే..ప్రతి ఊరులో మద్యం దుకాణాలు, మద్యం సులభంగా లభిస్తోంది. మద్యం ప్రియులకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా తాగేందుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. పనిచేసుకునే కూలీల నుంచి ఉద్యోగులు, యువతీ యువకులు , వృద్ధులు ..ప్రతి ఒక్కరు మద్యానికి బానిసైన వాళ్లే. రేటు ఎంతున్నా సరే బీర్లు, వైన్లు, బ్రీజర్లు లాగించేస్తున్నారు. కుటుంబాలు గుల్లవుతున్నా పట్టించు కోవడం లేదు. మద్యం కారణంగా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మహిళలపై మానసికంగా, శారీరకంగా వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వాలు మద్యాన్ని మరింత పెంచేందుకు దోహదం చేసేలా చర్యలు తీసుకుంటున్నారే తప్పా..దానిని నిషేధించేందుకు ముందుకు రావడం లేదు.
బార్లు బార్లా తెరిచి ఉంచుతున్నా పట్టించు కోవడంలేదు. ఆయా సర్కార్లకు గణనీయమైన ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా సమకూరుతోంది. ఖజానా నిండుతోంది. లాన్సెట్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 189 దేశాలలో సర్వే చేపట్టింది. ఎక్కువగా మద్యాన్ని సేవించడంలో..కొనుగోలు చేయడంలో..తాగి ఊగడంలో ఇండియన్స్ రికార్డులు బ్రేక్ చేస్తున్నారని వెల్లడించింది. 2017లో ఒక్కరొక్కరు ఆరు లీడర్ల మద్యాన్ని సేవిస్తే..38 శాతంగా నమోదు కాగా..2010లో 4.3 లీటర్లు ఉండేది. 1990 నుండి 2017 వరకు చూస్తే మద్యం బాబుల తాగిన శాతం 70 శాతానికి పెరిగింది. చిన్న తరహా, మధ్యతరహా కుటుంబాలే ఎక్కువగా మద్యం పట్ల ఆకర్షితులవుతున్నారని తెలిపింది. పని వత్తిడిని తట్టుకునేందుకు..ఉపశమనం పొందేందుకు మద్యాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. మరికొందరు తాగడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు.
కొన్ని సంస్థల్లో ఉద్యోగులు తాగి వస్తూ విధులు నిర్వహిస్తున్నారని..ఇంకొందరు సీసీ కెమెరాల కంట పడకుండా బాత్రూంలలో దూరి మద్యాన్ని లాగించేస్తున్నారని సంస్థ తెలిపింది. మద్యాన్ని సేవించడం వల్ల 200 రకాల రోగాలు వచ్చే అవకాశాం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 75 శాతం మంది పురుషులు మద్యానికి బానిసైన వారే. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 237 మిలియన్ల పురుషులు 46 మిలియన్ల మహిళలు మద్యాన్ని సేవించడం వల్ల బాధితులుగా మారారని..రోగాలకు ఎఫెక్ట్ అయిన వారి సంఖ్య ఎక్కువగా యూరప్‌లో ఉందని తెలిపింది. 38 నుంచి 75 శాతానికి ఇండియాలో పెరగడం ప్రమాదకర సంకేతాలను సూచిస్తోందని..దీనిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇండియాలో చాలా చోట్ల నీళ్లంటే ఏమిటోనని చెప్పిన వాళ్లు..మద్యం అనే సరికల్లా రెడీగా దొరుకుతుందని చెప్పడం సర్వేయర్స్‌ను ఆశ్చర్యానికి లోను చేసింది. 700 మిలియన్ల ప్రజలు కోటి మిలియన్ల లీటర్ల మద్యాన్ని లాగించి రికార్డు బ్రేక్ చేశారు. సో..మనం అభివృద్ధిలో వెనుకంజలో ఉంటే ..తాగడంలో టాప్ లో నిలిచామన్నమాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి