రికార్డు బ్రేక్ చేసిన టీసీఎస్..ఐటీ సర్వీసెస్‌లో మూడో స్థానం
భారతీయ మార్కెట్‌ను శాసిస్తున్న టాటా గ్రూప్ సంస్థలు ..ఐటీ రంగంలో కూడా తమదైన బ్రాండ్‌ను కొనసాగిస్తున్నారు. విలువలే ప్రామాణికంగా పాటించే సంస్థగా టాటా కన్సట్టెన్సీ సర్వీసెస్‌కు మంచి పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలు అందించే కంపెనీలలో మూడో స్థానంలో టీసీఎస్ నిలిచి రికార్డు సృష్టించింది. ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ అంచనా ప్రకారం టీసీఎస్ సేవల పరంగా 9.6 శాతాన్ని నమోదు చేసింది. దీని విలువ దాదాపు 1.82 బిలియన్ల వ్యాపారం జరిగిందన్నమాట. ఇదే జోరు ఈ సంవత్సరం ఆఖరు వరకు కంపెనీ 20.91 బిలియన్లను పోగేసుకుంటుందని అంచనా వేసింది. సాఫ్ట్ వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో 2018-2019 ఐటీ రంగంలో వరల్డ్ వైడ్‌గా సేవలందించడంలో టాప్ ఫైవ్‌లో నిలిచింది.
మరోసారి ఇండియన్స్ ఐటీ రంగంలో రాణిస్తారని నిరూపించింది ఈ కంపెనీ. డిఎక్స్‌సీ టెక్నాలజీని టీసీఎస్ ఒక్కటే వాడుతోంది. 15.52 బిలియన్ డాలర్ల రెవిన్యూను స్వంతం చేసుకోనుందని అంచనా. 2017 సంవత్సరం నుండి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిలకడగా ఐటీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వస్తోంది. ఒడిదుడుకులకు లోనైనా ఎక్కడా కూడా టెక్నాలజీ పరంగా ఇబ్బందులు రాకుండా చూసుకుంటోంది. సిబ్బందికి వేతనాలు అందించడం లోను..సేవలు పొందడంలోను..సర్వీసెస్ కచ్చితంగా ఉండడం టీసీఎస్ కు లాభం చేకూర్చేలా చేస్తోంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్న రాజేష్ గోపినాథన్ వచ్చాక సంస్థ రూపురేఖలు పూర్తిగా మార్చేశారు.
సంస్థను లాభాల బాట పట్టించేలా చేశాడు. బిజినెస్ పరంగా వివిధ సంస్థలకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో ఎంఓయులు కుదుర్చు కోవడం చేశారు. టాటా సన్స్ లిమిటెడ్ కంపెనీకి ఎన్. చంద్రశేఖరన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్నారు. గోపినాథన్, చంద్రశేఖరన్‌లు టీసీఎస్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. 2017లో డిఎక్స్‌సీ 25.39 బిలియన్ల రెవిన్యూ పొందితే..టీసీఎస్ కంపెనీ 17.57 బిలియన్ల డాలర్లను పోగేసుకుంది. గత రెండు సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ పరిశీలిస్తే డీఎక్స్‌సీ ఆదాయంలో 4 శాతం రెవిన్యూ తగ్గగా..3.34 బిలియన్ డాలర్ల ఆదాయం టీసీఎస్‌కు పెరిగింది.
యుఎస్ పబ్లిక్ సెక్టార్ బిజినెస్ డీఎక్స్‌సీ తన వాటా 2.8 బిలియన్ల రెవిన్యూ సాధిస్తే..ఐబీఎం కంపెనీ 79.59 బిలియన్ల రెవిన్యూను గత ఏడాది సాధించింది. ఇదంతా ఐటీ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ ద్వారా వచ్చిందే. గ్లోబల్ బిజినెస్ పరంగా చూస్తే ఇదే సంస్థ 69.59 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది.టెక్నాలజీ సర్వీసెస్, కాగ్నిటివ్ సర్వీసెస్ , ఐటీ సర్వీసెస్ బిజినెస్ లోంచి వచ్చిందే ఇదంతా. ఆక్సెంచర్ కంపెనీ గత ఏడాది 39.57 బిలియన్ డాలర్ల రెవిన్యూ పొందింది. రాబోయే రోజుల్లో ఐటీ సెక్టార్‌లో సర్వీసెస్ విభాగంలో టీసీఎస్ మొదటి స్థానం పొందినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఎందుకంటే నిపుణులు, అనుభవజ్ఞులు..సర్వీసెస్ విషయంలో కచ్చితత్వం కంపెనీకి కోట్లు కుమ్మరించేలా చేస్తోంది. ఎంతైనా టాటానే కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి