టీ ష‌ర్ట్‌ల వ్యాపారం..20 కోట్ల ఆదాయం

కాస్తంత డిఫ‌రెంట్‌గా ఆలోచిస్తే ..ప్ర‌స్తుత మార్కెట్‌లో ఈజీగా డ‌బ్బులు సంపాదించొచ్చ‌ని వీరిని చూస్తే తెలుస్తుంది. ప్ర‌పంచంలో ఎక్కువ‌గా యువ‌తీ యువ‌కుల‌ను టార్గెట్ గా చేసుకుని వ్యాపారం న‌డుస్తోంది. వేలాది కంపెనీలు స్వంతంగా టీ ష‌ర్ట్‌ల‌తో పాటు జీన్స్‌ల‌ను డిఫ‌రెంట్ వే లో ప్ర‌జెంట్ చేస్తున్నాయి. రోజుకు 1000 ఆర్డ‌ర్లు వ‌స్తుండ‌డంతో గ‌ణ‌నీయ‌మైన ఆదాయాని గ‌డిస్తున్నారు ఈ యూత్. చెన్నై నుండి తిరుపూర్ దాకా అన్న ట్యాగ్ లైన్ తో టీ ష‌ర్ట్ ల వ్యాపారం మూడు పూలు ఆరు కాయ‌లుగా విరాజిల్లుతోంది. తిరుపూర్ నైట్ వేర్ ప‌రిశ్ర‌మ‌కు కేంద్రంగా ఉంటోంది. ప్ర‌వీణ్ , సింధూజ‌లు క‌లిసి దీనిని క్రియేట్ చేశారు. కాలేజీలు తిరిగారు..వాటినే టార్గెట్ చేశారు. డిఫ‌రెంట్ క‌ల‌ర్స్..ఆక‌ట్టుకునే డిజైన్లతో ఆక‌ట్టుకునేలా..కొనుగోలు చేసేలా క‌ష్ట‌ప‌డ్డారు వీరిద్ద‌రు.
యూత్ ఎప్పుడూ కొత్త‌ద‌నాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా దుస్తుల విష‌యంలో ఛేంజెస్ ఇష్ట‌ప‌డ‌తారు. వారి అభిరుచుల‌కు అనుగుణంగానే మేం టార్గెట్ చేశాం. టీ ష‌ర్ట్స్, పాయింట్స్, జీన్స్ ను త‌యారు చేసేందుకు ప్ర‌య‌త్నం చేశాం. ఐటీ ప్రొఫెష‌న‌ల్స్ ను సంప్ర‌దించ‌డం ..కోయింబ‌త్తూరు కేంద్రంగా వెబ్ బేస్డ్ ఆధారంగా ఆప‌రేష‌న్స్ నిర్వ‌హించేలా చేశారు. లాజిస్టిక్స్ విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. మార్కెట్‌కు అనువుగా ఉన్న సెంట‌ర్ పాయింట్ల‌ను గుర్తించారు. కొరియ‌ర్ సంస్థ‌ల‌తో ఎంఓయు కుదుర్చుకున్నారు. యంగ్ ట్రెండ్జ్ పేరుతో కంపెనీగా మార్చారు. స్టే యంగ్..లైవ్ ట్రెండీ పేరుతో ట్యాగ్ లైన్ త‌గిలించారు. ఈ సంస్థ 18 ఏళ్ల నుండి 28 ఏళ్ల వ‌య‌స్సున్న యువ‌తీ యువ‌కుల‌ను వీరు టార్గెట్ చేశారు. టీ ష‌ర్ట్స్ కు గ్రాఫిక్ డిజైన్స్ వాడారు.

మార్కెట్‌లో హెవీ కాంపిటిష‌న్ ఉండ‌డంతో దానిని త‌ట్టుకునేందుకు సోష‌ల్ మీడియాను వాడుకున్నారు. ల‌క్షా 50 వేల ప్రొడ‌క్ట్స్ మొద‌టి పేజీల్లో క‌నిపించేలా చేశారు. నేష‌న‌ల్, ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్ కూడా అందుబాటులో ఉండేలా చేశారు. 30 మంది యంగ్ ట్రెండ్స్ కంపెనీలో ప‌నిచేస్తున్నారు. తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, హ‌ర్యానా, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, వెస్ట్ బెంగాల్‌ల‌లో వేర్ హౌస్‌ల‌ను ఏర్పాటు చేసిందీ ఈ సంస్థ‌. ఢిల్లీలో వీరి ఉత్ప‌త్తుల‌కు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ఆన్ లైన్‌లో బుకింగ్ చేసుకున్న మ‌రుస‌టి రోజే డెలివ‌రీ అయ్యేలా చేస్తోంది ఈ కంపెనీ. యంగ్ ట్రెండ్జ్ క‌పుల్ క్లోతింగ్ పేరుతో డ్రెస్సెస్‌ను డిజైన్ చేశారు. దీనికి ఎక్కువ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. గ‌ణ‌నీయ‌మైన ఆదాయం స‌మ‌కూరుతోంది.

చైనీస్, కొరియ‌న్ మార్కెట్‌ల ఆధారంగా దుస్తులు డిజైన్ చేస్తున్నాయి. వాలంటైన్స్ డే రోజు హెవీ ఆర్డ‌ర్స్ వ‌స్తున్నాయి. ఫోటో షూట్స్ ,క్యాంపెయిన్ షూట్స్ స్వంతంగా చేయిస్తున్నారు. వీరు అమ్మే దుస్తులు 250 రూపాయ‌ల నుండి 600 రూపాయ‌ల లోపే ఉంటున్నాయి. 3 వేల 500 ర‌కాల డిజైన్లు అందుబాటులో ఉంచారు. 70 శాతం రెవిన్యూ ఆదాయం వీటిని అమ్మ‌కం ద్వారా వ‌స్తోంది. ఎక్కువ కొనుగోలు చేసే వారికి ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయి. రోజుకు 25 వేల ప్రొడ‌క్ట్స్ అమ్ముతున్నారు. ఫ్లిప్ కార్ట్ యంగెస్ట్ బిజినెస్ అవార్డును స్వంతం చేసుకుంది యంగ్ ట్రెండ్జ్. ఒక్క పైసా ఖ‌ర్చు చేయ‌కుండానే కోట్ల రూపాయ‌ల వ్యాపారం చేసేలా ఎదిగేలా చేసిన ప్ర‌వీణ్ , సింధూజాలను అభినందించ‌కుండా ఉండ‌లేం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!