620 కోట్ల డీల్..రిల‌య‌న్స్ వ‌శ‌మైన హామ్లేస్

టాయిస్ రంగంలో ప్ర‌పంచంలోనే అత్యంత పేరొందిన కంపెనీగా వినుతికెక్కిన హామ్లేస్ కంపెనీని 620 కోట్ల‌కు భారీ ఆఫ‌ర్ తో రిలియ‌న్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కొనుగోలు చేసింది. టాయిస్ ప‌రిశ్ర‌మ‌లో ఇదో రికార్డుగా న‌మోదు కానున్న‌ది. ఈ మేర‌కు ఆ కంపెనీతో ఎంఓయు కూడా చేసేసుకుంది. 100 శాతం స్టేక్ హోల్డ‌ర్‌గా అవ‌త‌రించింది. హామ్లేస్ హోల్డింగ్స్ లిమిడెట్ కంపెనీ హాంగ్ కాంగ్ కేంద్రంగా - సి బ్యాన‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ పేరుతో న‌డుస్తోంది. 1760 సంవ‌త్స‌రంలో హామ్లేస్ ను లండ‌న్‌లో ఏర్పాటు చేశారు. ప్ర‌పంచంలోనే అత్యంత పురాత‌న‌మైన సంస్థ‌గా దీనికో చ‌రిత్ర ఉంది. టాయిస్ ను మాత్ర‌మే హామ్లేస్ త‌యారు చేస్తుంది.

ఇదే దీని స్పెషాలిటీ. ఎన్నో సంస్థ‌లు చేతులు మారాయి. చివ‌ర‌కు రిల‌య‌న్స్ కోట్ల రూపాయ‌లు వెచ్చించి దీనిని స్వంతం చేసుకుంది. దీంతో హామ్లేస్ కంపెనీ ఇక‌నుంచి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ హామ్లేస్ సి బ్యాన‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోల్డింగ్స్ గా మార‌నుంది. రిల‌య‌న్స్ బ్రాండ్స్ లిమిటెడ్..రిలయ‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్‌లో భాగంగా ఉంది. 67.96 మిలియ‌న్ డాల‌ర్ల‌కు చేజిక్కించుకుంది. ఇదంతా చెక్కుల రూపేణా కాదు..మొత్తం లిక్విడ్ క్యాష్ పేమెంట్ చేసింది రిల‌య‌న్స్. సి. బ్యాన‌ర్ సంస్థ‌తో ఈ మేర‌కు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ విష‌యాన్ని గ‌తంలోనే రిల‌య‌న్స్ సంస్థ ప్ర‌క‌టించింది. టాయిస్ ప‌రిశ్ర‌మ‌లో హామ్లేస్‌కు మంచి పేరుంది. 2003 జూన్ లో బాన్ గూర్ గ్రూప్ దీనిని కొనుగోలు చేసింది. లండ‌న్ స్టాక్ మార్కెట్‌లో బాగూర్ గ్రూప్ లిస్టెడ్ అయింది.

68.8 మిలియ‌న్ డాల‌ర్ల‌కు డీల్ కుదిరింది. మ‌రో వైపు 2012లో ఫ్రాన్స్ కు చెందిన గ్రూపే లూడెండో కంపెనీ 78.4 మిలియ‌న్ డాల‌ర్ల‌కు చేజిక్కించుకుంది. హామ్లేస్ కంపెనీల చేతులు మారే కొద్దీ త‌న వాల్యూను కోల్పోతూ వ‌చ్చింది. 2017లో 12 మిలియ‌న్ల న‌ష్టం చ‌వి చూసింది. హామ్లేస్ సంస్థ‌కు 18 దేశాల‌లో 167 స్టోర్స్ ఉన్నాయి. ఇండియా వ‌ర‌కు వ‌స్తే రిల‌య‌న్స్ రిటైల్ ఫ్రాంచైజీల ద్వారా 29 న‌గ‌రాల్లో 88 స్టోర్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే రిల‌య‌న్స్ బ్రాండ్స్ సంస్థ ప్రెసిడెంట్ ద‌ర్శ‌న్ మెహ‌తా వెల్ల‌డించారు. రిటైల్ ప‌రంగా టాయిస్ అమ్మ‌కాల్లో రిల‌య‌న్స్ మ‌రో చ‌రిత్ర సృష్టించేందుకు రెడీ అయింద‌న్న‌మాట‌.

కామెంట్‌లు