చరిత్ర సృష్టించిన మోదీ సర్కార్ ..పక్కా ప్లాన్..బిల్లులు పాస్ ..!
ప్రభుత్వాన్ని నడపడమంటే వంట చేసినంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు..ఇంకెన్నో ఆరోపణలు..విమర్శలు. విపక్షాల అడ్డంకులను తట్టుకుని ..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చే వత్తిళ్లను దాటుకుంటూ సర్కార్‌ను నడపాలంటే చాలా ఓపిక కలిగి ఉండాలి. బీజేపికి చెందిన నరేంద్ర మోదీ ఎప్పుడైతే కేంద్రంలో కొలువు తీరారో అప్పటి నుంచి ఇండియాలో మోదీ జపం వినిపిస్తోంది. ఓ వైపు రాం దేవ్ బాబా..మరో వైపు మోదీ..అమిత్ షాలు ఒక్కసారి ప్లాన్ గీశారంటే ఇక వర్కవుట్ కావాల్సిందే. తాజాగా కర్ణాటకలో కొలువుతీరిన కాంగ్రెస్, జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వానికి చెక్ పెట్టారు. మోదీ కాలు మోపడం, ఆ తర్వాత అమిత్ షా ఎంటర్ కావడం..దాని వెనుక పరిణామాలు చకా చకా మారి పోవడం షరా మామూలై పోయింది. ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న వారికి తెర వెనుక జరిగే మంత్రాంగం గురించి తెలిసే వుంటుంది.
రాబోయే 2020 నాటికి బీజేపీ మాత్రమే ఉండాలన్నది వీరిద్దరి ప్లాన్. అందులో భాగంగానే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు , పార్టీకి అనుకూలంగా మార్చుకుంటున్నారు మోదీ అండ్ షా. బిల్లులు ఆమోదం పొందాలంటే అధికార పక్షం ఉంటే సరిపోదు, దానికి కావాల్సిన విపక్షాలకు చెందిన సభ్యులు కూడా ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. బిల్లు పాస్ అయ్యే ముందు తప్పనిసరిగా దాని మీద చర్చ జరిపి తీరాల్సిందే. ఈ వ్యవస్థను మరింత పటిష్టవంతంగా తయారు చేసింది మాత్రం ..రాజ్యాంగ నిర్మాత , రచయిత బాబా సాహెబ్ అంబేద్కర్‌ది. బిల్లు పాస్ కావాలంటే మూడింటిలో రెండో వంతు ఓటింగ్ జరగాలి. లోక్‌సభలో పాస్ అయ్యాక..తిరిగి బిల్లును పెద్దలసభ అయిన రాజ్యసభకు పంపిస్తారు. అక్కడ కూడా ఓకే అయితే..బిల్లు పాస్ అయినట్లు లేకపోతే తిరిగి పంపిస్తారు. దీని మీద రాజముద్ర కావాలంటే ..కంపల్సరీగా భారత రాష్ట్రపతి సంతకం ఉండాల్సిందే. ఆయన ముద్ర కూడా వేయాల్సిందే. లేకపోతే అది రెండు సభల్లో ఓకే అయినా కానట్టు లెక్క.
కాగా లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో తాజాగా ఏకంగా 30 బిల్లులు ప్రవేశ పెట్టగా 20 బిల్లులు ఆమోదం పొందాయి. ఇది మోదీ సర్కార్ పరంగా చరిత్ర సృష్టించింది. రెండోసారి కేంద్రంలో భారీ మెజారిటీతో పవర్‌లోకి వచ్చిన మోదీ సర్కార్..పార్లమెంట్ చరిత్రలోను నూతన అధ్యాయానికి తెర తీసింది. తాజాగా బడ్జెట్ సమావేశంలో రికార్డు స్థాయిలో బిల్లులు ప్రవేశ పెట్టడం..వాటికి అత్యధికంగా ఓకే కావడం జరిగింది. దీని వెనుక మోదీ, షా టీం వర్కవుట్ చేసింది. 17వ లోక్‌సభలో 30 బిల్లులు రాగా..20 ఆమోదం పొందాయి. రెండు సభలలో ఆమోదం పొందినవి 14 బిల్లులు. ఇక 2004లో 6 బిల్లులు పాస్ కాగా, 2009లో 8 , 2014లో 12 బిల్లులు ఆమోదం పొందగా ..ఏకంగా 2019లో 20 బిల్లులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీని వెనుక వీరిద్దరి కృషి ఉందన్నది మాత్రం వాస్తవం. అయితే విపక్షాలు మాత్రం బీజేపీ సర్కార్‌పై కారాలు మిరియాలు నూరుతున్నాయి. మెజారిటీ ఉందనే సాకుతో విపక్షాలను పరిగణలోకి తీసుకోకుండానే బిల్లులు ప్రవేశ పెడుతున్నారని..వాటిని వారే ఆమోదింప చేసుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. ఏది ఏమైనా బిల్లుల ఓకేతో మరోసారి మోదీ, షా టీంలకున్న పవర్ ఏమిటో రూఢీ అయింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి