బిగ్ బాస్ నుండి హేమ అవుట్..సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ జాఫ‌ర్

తెలుగు టెలివిజ‌న్ రంగంలో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్న మా టీవీ ప్ర‌సారం చేస్తున్న బిగ్ బాస్ ప్రోగ్రాంకు అనూహ్య‌మైన రీతిలో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి రేటింగ్ పెరుగుతోంది. దీంతో ఈ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్‌ను భారీగా ఆఫ‌ర్ ఇచ్చి కొనుగోలు చేసిన స్టార్ టీవీ గ్రూప్ సంస్థ‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతోంది. బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఇత‌ర ఛాన‌ళ్ల కంటే భిన్నంగా ఉంటోంది. యువ‌తీ యువ‌కుల‌తో పాటు మ‌హిళ‌ల‌ను కుటుంబాల‌ను ఆక‌ట్టుకునేలా తీర్చి దిద్దేందుకు యాజ‌మాన్యం ప్లాన్ చేసింది. ఇది మూడో సీజ‌న్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే బిగ్ బాస్ ప్రారంభ‌మై 8 రోజులవుతోంది. ప్ర‌తి వారానికి ఎవ‌రో ఒక‌రు ఈ ప్రోగ్రాం నుండి ఎలిమినేట్ కావ‌డం జ‌రుగుతూ వ‌స్తోంది. మొత్తం ఈ కార్య‌క్ర‌మం 100 రోజులు సాగుతుంది. ఎక్క‌డ‌లేని ట్విస్టుల‌తో ..డిఫ‌రెంట్ మాడ్యూలేష‌న్స్‌తో ప్ర‌తి రోజు ఉత్కంఠ‌ను రేపుతోంది బిగ్ బాస్. ప్ర‌తి ర‌న్నింగ్ టైం 90 నిమిషాలు నిడివి ఉంటుంది. దేశ వ్యాప్తంగా స్టార్ ప్రారంభించిన బిగ్ బాస్ ప్రోగ్రాంకు ఎన‌లేని డిమాండ్ రావ‌డంతో..ఇత‌ర రీజిన‌ల్ లాంగ్వేజ్‌ల‌లో కూడా ప్ర‌సారం చేయాల‌ని సంక‌ల్పించింది మేనేజ్‌మెంట్.

తెలుగులో మాటీవీని స్టార్ కొనుగోలు చేశాక‌.. ఛాన‌ల్‌ను స‌మూలంగా మార్చేశారు. మొద‌టిసారిగా బిగ్ బాస్ కు శ్రీ‌కారం చుట్టారు 2017 జూలై 16న. ఈ రియాల్టీ షో ఇంటిల్లి పాది చూసేలా ఉండ‌డం లేద‌ని, ద్వంద‌ర్థాల‌తో పాటు కొంచెం ఎబ్బెట్టుగా..పిల్ల‌లు చూడ‌లేని విధంగా, రొమాన్స్ కొంచెం మోతాదు మించి పోయిందంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 24 సెప్టెంబ‌ర్ 2017తో మొద‌టి బిగ్ బాస్ ప్రోగ్రాం పూర్త‌యింది. దీనిని ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. 10 జూన్ 2018లో ఏదైనా జ‌ర‌గొచ్చు అనే పేరుతో బిగ్ బాస్ స్టార్ట‌యింది. స‌క్సెస్ ఫుల్‌గా రేటింగ్ వ‌చ్చింది. 30 సెప్టెంబ‌ర్ 2018లో పూర్త‌యింది రెండో ఎపిసోడ్. దీనిని మ‌రో న‌టుడు నాని హోస్ట చేశారు.  బిగ్ బాస్ ప్రోగ్రాం మూడో ఎపిసోడ్ ..పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. జ‌రుగుతుందో లేదోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. ఈ ప్రోగ్రాంకు సంబంధించి మా టీవీ భారీ ఎత్తున ప్ర‌చారం చేసింది. ఇందు కోసం భారీ ఎత్తున క‌స‌ర‌త్తు చేసింది. ప్ర‌ముఖ న‌టి హేమ‌, యాంక‌ర్స్ శ్రీ‌ముఖి, శివ‌జ్యోతి, న‌టుడు వ‌రుణ్ సందేశ్ తో పాటు ఆయ‌న భార్య‌, హిమ‌జ‌, పాపుల‌ర్ టీవీ9 యాంక‌ర్ జాఫ‌ర్ , బాస్క‌ర్ బాబా ..ఇలా బిగ్ బాస్‌లో సంద‌డి చేశారు.

షో ప్రారంభం కాక ముందు ఈ షోలో అంతా బూతు త‌ప్పా ఇంకేం లేద‌ని, తన‌ను తీసుకుంటాన‌ని చెప్పి మోసం చేశారంటూ ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు శ్వేతా రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇది టెలికాస్ట్ కాకుండా నిలిపి వేయాల‌ని కోరుతూ కోర్టుకు ఎక్కారు. దీంతో విప‌రీత‌మైన క్రేజ్ బిగ్ బాస్ కు వ‌చ్చింది. కోర్టు మాత్రం ప‌రిమితుల‌కు లోబ‌డి టెలికాస్ట్ చేయాల‌ని ఆదేశించింది. నాగార్జున మ‌రింత స్మార్ట్‌గా హోస్ట్‌గా దీనిని స్టార్ట్ చేశారు. ఆయ‌న‌కు ఇంత‌కు ముందే మా టీవీలో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేసిన అనుభ‌వం ఉండ‌డంతో దీనిని మ‌రింత ఆక‌ట్టుకునేలా యాంక‌రింగ్ చేస్తున్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు కొట్టుకునే దాకా వెళ్లింది. బిగ్ బాస్‌లో బాస్ ఇచ్చే ఆదేశాలు పాటించ‌డం, ఆట‌లు, పాట‌లు, విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, ఒక‌రిపై మ‌రొక‌రు జాలి ప‌డ‌డం, క‌న్నీళ్లు కార్చ‌డం దాకా వెళ్లింది. వీరంద‌రికి పాయింట్స్ రావ‌డం, దాని ఆధారంగా ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది టెన్ష‌న్ నెల‌కొంది. చివ‌రి వ‌ర‌కు ఊహించ‌ని రీతిలో నాగార్జున ..న‌టి హేమ ఈ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించి..ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. 

కామెంట్‌లు