అనాధ పిల్లలను దత్తత తీసుకున్న నటీనటులు..!
వాళ్లు మనలాంటి మనుషులే. కాక పోతే వాళ్లకు కూడా మనలాగే హృదయం ఉంటుందని నిరూపిస్తున్నారు బాలీవుడ్‌కు చెందిన సినీ నటీనటులు. ఎక్కడికి వెళ్లినా వీళ్లు సెలబ్రెటీలు. చిటికేస్తే కోట్ల రూపాయలు వాలిపోతాయి. అంతలా స్టార్‌డమ్‌తో పాటు పాపులర్ కావడంతో మనకు ఓ అభిప్రాయం ఉంటుంది. వీరు ఉన్నత స్థాయిలో ఉంటారని, ఇతరుల గురించి ఆలోచించరని, వాళ్లకు డబ్బులు ఎక్కువని..మనం కనిపించమంటూ ఓ రాంగ్ ఒపినియన్ ఉంటుంది. ఒక్కో నటుడు..నటికి ఎక్కడలేని పేరు సంపాదించుకున్న వారే. తెరపై అన్ని పాత్రలు పోషించే వీరంతా ..వృత్తిపరంగా బిజీగా ఉన్నప్పటికీ ..పేవ్ మెంట్‌లపై ఉన్న పిల్లలను చేరదీశారు. అంతేకాకుండా అనాధ ఆశ్రమంలో సేద తీరుతున్న వారిని కూడా వీరు దత్తత తీసుకున్నారు. సో..సమాజం పట్ల, మనుషుల పట్ల తమకు కన్‌సర్న్ ఉందని నిరూపించారు.
వీరిలో 10 మంది టాప్ లో నిలిచిన వారున్నారు. ఒకప్పుడు ఒక ఊపు ఊపిన నటీమణి సుస్మితా సేన్ ..రేణే, అలీషా అనే బాలికలను దత్తత తీసుకున్నారు ఆమె. టాప్ రేంజ్‌లో ఉంటూ సక్సస్ ఫుల్ నటిగా పేరు తెచ్చుకున్న రవీనా టాండన్ కూడా ఇతర నటీనటులకు తీసిపోని విధంగా ఆమె కూడా మరో ఇద్దరిని అడాప్ట్ చేసుకున్నారు. రాశా, రణ్‌బీర్ అనే పిల్లలను 21 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే దత్తత తీసుకోవడం విశేషం. వీరిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇక మరో బాలీవుడ్ సూపర్ స్టార్ ..డైనమిక్ హీరోగా ఉన్న సల్మాన్ ఖాన్ సైతం తనకు మనసు ఉందని నిరూపించారు. అర్పిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు ఈ హీరో. వీరి కోసం ఈ నటీ నటులు పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నారు. వీరి గొప్ప మనసును చూసి మిగతా సినిమాలోని వారంతా ఎంకరేజ్ చేయడంతో పాటు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంకో సంచలనం రేపిన విషయం ఏమిటంటే..మరో వర్దమాన నటుడు మిధున్ చక్రవర్తి ..ఏకంగా రోడ్డుపై పారేసిన అమ్మాయిని ఆయన తీసుకుని పెంచుకున్నారు. ఆ అమ్మాయికి ఆలనా పాలనా అంతా అతనే. ఆయనకు అప్పటికే ముగ్గురు మగ బిడ్డలు ఉన్నారు. నమాషి, రిమోహ్, మిమోహ్‌లు. వీరికి తోడుగా అనాధ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయికి దిశానీ అనే పేరు కూడా పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. మరో సినీ జంట సమీర్ సోనీ, నీలమ్ కొఠారిలు అహానా అనే అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు. కునాల్ కోహ్లి , భార్య రవీనాలు పిల్లలు వద్దనుకుని రాధా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ప్రముఖ దిగ్గజ దర్శకుడు సుభాష్ ఘాయ్ , భార్య రెహానా లు మేఘనా ఘాయ్ అనే బాలికను పెంచుకుంటున్నారు. మరో వైపు కల్ హో నా హో దర్శకుడు నిఖిల్ అద్వానీ కేయా అనే బాలికను, దిబాకర్ బెనర్జీ అనే డైరెక్టర్ మరో బాలికను పెంచుకుంటున్నారు. ప్రముఖ తమిళ నటీమణి శోభన కూడా ఓ బాలుడిని దత్తత తీసుకుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి